ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మధ్యాహ్న భోజనాల పరిశీలన

ABN, Publish Date - Nov 23 , 2024 | 10:57 PM

పేట జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలను శనివారం పలువురు అధికారులు తనిఖీ చేశారు.

కోస్గి మండలం నాచారం గ్రామంలోని కేజీబీవీలో విద్యార్థులకు వండిన అన్నాన్ని పరిశీలిస్తున్న ట్రైనీ కలెక్టర్‌ గరీమానరుల

- వసతిగృహాలు, పాఠశాలల తనిఖీల్లో అధికారులు

- విద్యార్థులతో కలిసి భోజనం

- ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచనలు

కోస్గి/కృష్ణ/నర్వ/ఊట్కూర్‌/దామరగిద్ద/ ధన్వాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పేట జిల్లాలోని పాఠశాలలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలను శనివారం పలువురు అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల మధ్యాహ్న భోజనాలను వారు పరిశీ లించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

కోస్గి మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ వసతిగృహాలతో పాటు, నాచారం గ్రామంలో ఉన్న కేజీబీవీని ట్రైనీ కలెక్టర్‌ గరీమానరుల తని ఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా వసతిగృహాల్లో బియ్యాన్ని పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించారు. ఎస్సీ వసతిగృహానికి వచ్చి న బియ్యంలో పురుగులు ఉండడంతో వెంటనే గోదాంకు పంపించి నూతనంగా వచ్చిన బియ్యాన్ని తీసుకోవాలని తహసీల్దార్‌ శ్రీనివాసులుకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్‌నాయక్‌, వార్డెన్లు, ప్రిన్సిపాల్‌ తదితరులున్నారు.

కృష్ణ మండలంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయాలను అదనపు రెవెన్యూ కలెక్టర్‌ బెన్‌షాలం పరిశీలించారు. శని వారం తెల్లవారుజామున హిందూపూర్‌ గ్రామ శివారులోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అల్పాహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మండల అధికారులు పాఠశాలలను తరచూ తనిఖీలు నిర్వహించి, వంటలను పరిశీ లించాలని ఆయన ఆదేశించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసి, పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్‌ దయాకర్‌రెడ్డికి సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జానయ్య, ఎస్‌వో శాలిని, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

నర్వ మండల కేంద్రంతో పాటు, ఊట్కూర్‌ మండలం పులిమామిడి గ్రామంలో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలను ఆర్డీవో రాంచందర్‌ నాయక్‌ తనిఖీ చేశారు. ఆయా కేజీబీవీల్లో స్టోర్‌ రూమ్‌లో నిల్వ ఉన్న బియ్యంతో పాటు, కూరగాయలు, పండ్లు తదితర వంట సామగ్రిని పరిశీ లించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన వసతుల గురించి ఆరా తీశారు. అనంతరం పాఠశాలల పరిసరాల, మరుగుదొడ్లు పరిశీలించారు. పులిమామిడిలోని కేజీబీవీలో విద్యార్థులతో కలిసి ఆర్డీవో మధ్యాహ్న భోజనం చేశారు. నర్వ డీటీ శ్రీనివాసులు, ఎస్‌వో శిరీష, ఊట్కూర్‌ తహసీల్దార్‌ రవి, ఆర్‌ఐ వెంకటేష్‌, ప్రిన్సిపాల్‌ లక్ష్మీ ఉన్నారు.

ఊట్కూర్‌ మండలం పెద్దజట్రం, అవుసులోన్‌ పల్లి, బిజ్వార్‌, మగ్దూంపూర్‌ గ్రామాల్లోని పాఠశాలలను మండల ప్రత్యేక అధికారి ఉమాపతి, ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్‌, ఎంఈవో రామచంద్రాచారిలు ఆకస్మిక తనిఖీ చేశారు. మగ్దూంపూర్‌ పాఠశాలలో విద్యార్థులతో కలిసి వారు భోజనం చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.

దామరగిద్ద మండల కేంద్రంలోని జిల్లా పరిష త్‌ ఉన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను శనివారం ఎంపీడీవో సాయిలక్ష్మి, తహసీల్దార్‌ జయరాములు, దామర గిద్ద స్పెషల్‌ ఆఫీసర్‌ బాలమణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్పెషల్‌ ఆఫీసర్‌, ఎంపీడీవో, తహసీల్దార్‌ విద్యార్థులతో పాటు కూర్చుని భోజనం చేశారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తగు సూచనలు చేశారు. హెచ్‌ఎం అశోక్‌, శంభులింగం, కె.విజయ్‌కుమార్‌, లక్ష్మినారాయణ, రత్నం ఉన్నారు.

ధన్వాడలోని కస్తూర్బా గురుకుల పాఠశాలను తహసీల్దార్‌ సింధూజ, ఎంపీడీవో సాయిప్రకాష్‌తో కలిసి డీఆర్‌డీవో మొగులప్ప తనిఖీ చేశారు. వంట గదిలో పిల్లలకు వండిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ గురించి ప్రిన్సిపాల్‌ గంగ మ్మను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 10:58 PM