పోలేపల్లి సెజ్‌లో అధికారుల తనిఖీలు
ABN, Publish Date - Nov 05 , 2024 | 11:38 PM
పోలేపల్లి సెజ్‌లోని శిల్ప, హెటెరో ఫార్మా పరిశ్రమల నుంచి వ్యవసాయ పొలాలకు వదులుతున్న కాలుష్యం నీటిఅంశంపై అధికారులు విచారణ చేపట్టారు.
జడ్చర్ల, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పోలేపల్లి సెజ్‌లోని శిల్ప, హెటెరో ఫార్మా పరిశ్రమల నుంచి వ్యవసాయ పొలాలకు వదులుతున్న కాలుష్యం నీటిఅంశంపై అధికారులు విచారణ చేపట్టారు. పోలేపల్లికి చెందిన రైతు రఘునందనచారి ఫిర్యాదు మేరకు ఎంపీవో సరోజ, గ్రామ కార్యదర్శి లక్ష్మీ నారాయణ మంగళవారం ఫార్మా పరి శ్రమలలో, వ్యవసాయక్షేత్రంలో విచార ణ చేపట్టారు. ఫార్మ పరిశ్రమల నుంచి కాలుష్యం నీటిని వదులుతుండడంతో వ్యవసాయ పొలంలోకి వస్తున్నాయని, దీంతో వ్యవసాయ పొలం అంతా కాలుష్యం బా రిన పడడంతో పంటలు పండించుకోలేని దుస్థితి ఏర్పడిందంటూ రైతు రఘునందనచారి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా శిల్ప, హెటెరో ఫార్మ పరిశ్ర మల నుంచి వేస్టేజీ నీళ్లను వదులుతున్న పైపులైన్‌లను ఈ సందర్భంగా అధికారులు పరి శీలించారు. పైపులైన్‌లో నుంచి నీరంతా వ్యవసా య పొలంలోకి వస్తున్నట్లుగా గుర్తించారు. కాగా తమ పరిశ్రమల నుంచి వదులుతున్న నీరంతా కాలుష్యం కాదని, వ్యవసాయ పొలాలకు ఏమాత్రం నష్టం వాటిల్లదంటూ పరిశ్రమల ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పరిశ్రమల నుంచి వదులుతున్న కాలుష్యం నీటితో వ్యవసాయ పొలం పూర్తిగా దెబ్బతింటుం దని, పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడిం దంటూ రైతు రఘునందనచారి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఫిర్యాదు మేరకు చేప ట్టిన విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించనున్నట్లు ఎంపీవో సరోజ తెలిపారు.
Updated Date - Nov 05 , 2024 | 11:38 PM