అయోడిన్ ఉప్పును వాడాలి
ABN, Publish Date - Oct 21 , 2024 | 11:37 PM
అయో డిన్ ఉప్పును వాడాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సౌ భాగ్యలక్ష్మి అన్నారు.
- డీఎంహెచ్‌వో డాక్టర్ సౌభాగ్యలక్ష్మి
- జిల్లా వ్యాప్తంగా ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవం
- వైద్యుల ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీలు
నారాయణపేట/మాగనూరు/మరికల్/దామరగిద్ద/ధన్వాడ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): అయో డిన్ ఉప్పును వాడాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సౌ భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం నారాయణపేట లో ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ట్రైనీ కలెక్టర్ గరిమానరుల, డీఎంహెచ్‌వోలు ర్యాలీని ప్రారంభించారు. వీర సావర్కార్ చౌరస్తాకు వద్దకు చేరుకున్న ర్యాలీను ద్ధేశించి డీఎంహెచ్‌వో మాట్లాడారు. అయోడిన్ ఉప్పు వాడకం వల్ల కలిగే లాభాలను వివరిం చారు. అయోడైజ్డ్ ఉప్పు వాడకం వల్ల పిల్లల్లో సరైన పెరుగుదల, సంగ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రాఘ వేందర్‌రెడ్డి, భిక్షపతి, వసంత, బాలాజీ, మల్లికా ర్జున్, ప్రకాష్, శివకుమార్, విజయప్రకాష్ తది తరులున్నారు. అదేవిధంగా, మాగనూరులోని అంగన్‌వాడీ సబ్ సెంటర్‌లో అయోడిన్ ఉప్పు వాడకంపై అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా పీహెచ్‌సీ వైద్యురాలు డా.నాగజ్యోతి మా ట్లాడారు. అంగన్‌వాడీ టీచర్ జగదీశ్వరి, రాణి తేజస్విని, సూపర్‌వైజర్ వెంకటయ్యగౌడ్, ఏఎన్ ఎం సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మరికల్‌లో డాక్టర్ హరిసీత ఆధ్వర్యంలో జడ్పీ హెచ్‌ఎస్ విద్యార్థులు అయోడైజ్డ్ ఉప్పు వాడకం పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హరిసీ త విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అయో డిన్ లోప రుగ్మతల బారిన పడ్డవారు రక్త పరీక్ష లు చేయించుకొని వైద్యులు సూచించిన విధంగా మందులు వాడాలన్నారు. అరవింద్, బస్వరాజ్ ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. దామరగిద్దలో పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ కీర్తిరెడ్డి అయోడిన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు, కలిగే లాభాల గురించి రోగులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు వెంక టేష్, కిష్టమ్మ, వెంకట్‌రాంరెడ్డి, ఫార్మాసిస్ట్, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్వాడలో పీహెచ్‌సీ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ప్రపంచ అయోడిన్ లోప రుగ్మతల దినోత్స వంలో డాక్టర్ సింధూజ విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతకుముందు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అశోక్‌కుమార్, కత లప్ప, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 11:37 PM