ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెరువులను పరిశీలించిన ఇరిగేషన్‌ అధికారులు

ABN, Publish Date - Nov 06 , 2024 | 11:12 PM

‘చెరువులు, కుంటలు ఖతం’ శీర్షికన గతనెల 30వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వచ్చిన వార్తా కథనానికి అధికారులు స్పందించారు.

అప్పంపల్లి గ్రామ ఊర చెరువులో రాళ్లతో కట్టిన ప్రహరీ

మరికల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ‘చెరువులు, కుంటలు ఖతం’ శీర్షికన గతనెల 30వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో వచ్చిన వార్తా కథనానికి అధికారులు స్పందించారు. మండలంలోని అప్పంపల్లి గ్రామ ఊర చెరువుతో పాటు, పట్టణంలోని ధర్మన్నకుంట చెరువులను బుధవారం ఉమ్మడి జిల్లా ఇరిగేషన్‌ ఏఈ కిషన్‌, డీఈ కిరణ్‌కుమార్‌లు పరిశీలించారు. అప్పంపల్లి గ్రామంలోని ఊరచెరువులో రాళ్లతో నిర్మించిన ప్రహరీని, అదేవిధంగా, ధర్మన్నకుంట చెరువు వద్ద దాదాపు 75 శాతం స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఏఈ పేర్కొన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఇరిగేషన్‌ ఎస్సీ త్వరలోనే కబ్జాకు గురైన చెరువులను పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటారన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:12 PM