ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దృష్టి మరల్చేందుకే జమిలి ఎన్నికలు

ABN, Publish Date - Oct 10 , 2024 | 11:40 PM

దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాల నుంచి దృష్టి మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ

- జిల్లా కమిటీ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ

వడ్డేపల్లి, అక్టోబరు 10 : దేశం ఎదుర్కొంటున్న సంక్షోభాల నుంచి దృష్టి మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ విమర్శించారు. శాంతినగర్‌లోని భవానీ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా కమిటీ కమిటీ సభ్యుడు ఉప్పేరు నరసింహ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ, టి.సాగర్‌ మాట్లాడుతూ జమిలి ఎన్నికల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే శక్తుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చి వేయడం సరికాదన్నారు. జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగిందన్నారు. నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ర్యాలంపాడు రిజర్వాయర్‌ ప్రస్తుతం రెండు టీఎంసీలకే పరిమిత మైందని ఆరోపించారు. గట్టు ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ, జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి, నాయకులు రేపల్లె దేవదాసు, జి.రాజు, పరంజ్యోతి, వీవీ నరసింహ, మద్దిలేటి, నర్మద, ఈదన్న, రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 11:40 PM