కులగణనతో బడుగులకు న్యాయం
ABN, Publish Date - Nov 09 , 2024 | 11:16 PM
ఇంటింటి సర్వేతో నిర్వహిస్తున్న కులగణనతో బడుగులకు న్యాయం జరుగుతుంది. కుల గణన సర్వేతో తెలంగాణ దేశానికే ఆదర్శం కానున్నదని జడ్పీ మాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ ఇన్‌చార్జి సరిత అన్నారు.
- విలేకరుల సమావేశంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత
గద్వాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఇంటింటి సర్వేతో నిర్వహిస్తున్న కులగణనతో బడుగులకు న్యాయం జరుగుతుంది. కుల గణన సర్వేతో తెలంగాణ దేశానికే ఆదర్శం కానున్నదని జడ్పీ మాజీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ ఇన్‌చార్జి సరిత అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైనమిక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. అవి ప్రతిపక్షాలకు కంటగింపు కాకపోవడంతో విమర్శిస్తున్నారని వివరించారు. కులగణన బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వివరాలు తెలుస్తాయని ఈ సర్వే చేపట్టడం తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. ఇప్పటికే కొన్ని గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, ఈ సర్వే ఫలితాలతో మిగిలిన గ్యారెంటీలను పకడ్బంతీగా అమలు చేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మహిళా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిందని, ఈ సభ్యత్వంతో మహిళలకు చేరువై వారి సమస్యలను పంచుకుంటామని వివరించారు ఎంపీ డాక్టర్ మల్లు చొరవతో పునాదులకే పరిమితమైన ఐటీఐ కళాశాల త్వరలో రూపుదిద్దుకుంటుందని వివరించారు. రోడ్ల అభివృద్ధి త్వరలో నిధుల కేటాయింపులు జరుగుతాయని వివరించారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఇసాక్, నాయకులు మధుసూదన్‌బాబు, కబీర్డాస్ నర్సింహులు, శెట్టి ఆత్మకూర్ లక్ష్మన్, భాస్కర్ యాదవ్ ఉన్నారు.
Updated Date - Nov 09 , 2024 | 11:17 PM