సోమశిలలో కార్తీక శోభ
ABN, Publish Date - Nov 10 , 2024 | 10:59 PM
కార్తీక మాసం సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రా మంలో ఆదివారం కార్తీక శోభ సంతరించు కుంది.
- ఆలయాన్ని సందర్శించిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కార్యదర్శి భారతి లక్పతి నాయక్
- శివలింగానికి వెండితో తయారు చేయించిన శివుడి రూపాన్ని ధరింపజేసిన ఆలయ కమిటీ
కొల్లాపూర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రా మంలో ఆదివారం కార్తీక శోభ సంతరించు కుంది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎ త్తున భక్తులు సోమశిల గ్రామంలో లలి తాంబిక సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఆదివారం పబ్లిక్ ఎంట ర్ ప్రైజెస్ సెక్రటరీ భారతి లక్పతి నాయక్ లలితాంబిక సోమేశ్వర ఆలయాన్ని దర్శించు కున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గోవింద్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యు లు ఆమెను శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమేశ్వరాలయంలో భక్తులకు దర్శన మిచ్చే శివలింగానికి వెండితో తయారు చేయించిన శివుడి రూపాన్ని భారతి ల క్పతి నాయక్, ఆలయ కమిటీ చైర్మన్ గోవింద్ రెడ్డిలు ధరింపజేశారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధల తో ఆలయంలో దీపార్చన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రా మ్మోహన్, కేతూరి వెంకటస్వామి, కేతూరి రామస్వామి, అంజన్న, గొల్ల గోపాల్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బాల్రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 10:59 PM