ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోడింగ్‌ పరిజ్ఞానంపై పట్టు అవసరం

ABN, Publish Date - Dec 06 , 2024 | 11:39 PM

ప్రస్తుతం సాంకేతిక వేగంలో విద్యార్థులకు కోడింగ్‌ పరిజ్ఞానం అవసరమని కలెక్టర్‌ ఆదర్ష్‌ సురభి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో న్యూటన్‌ స్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో కోడింగ్‌ పాఠ శాలను అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ కలిసి ప్రారం భించారు.

తేమ శాతాన్ని పరిశీలిస్తున్న వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

గోపాల్‌పేట, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రస్తుతం సాంకేతిక వేగంలో విద్యార్థులకు కోడింగ్‌ పరిజ్ఞానం అవసరమని కలెక్టర్‌ ఆదర్ష్‌ సురభి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాలలో న్యూటన్‌ స్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో కోడింగ్‌ పాఠ శాలను అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కోడింగ్‌ పాఠశాల ద్వారా అందరు మూడు నెలల పా టు జరిగే ప్రోగ్రామింగ్‌ నేర్చుకొని ప్రోగ్రాం పూర్తి అయిన వెంటనే పట్టు సాధించిన వారికి సర్టిఫికెట్‌ ఇస్తారని అన్నా రు. అనంతరం పాఠశాలలోని వంట సామగ్రిని భద్రపరిచే గదిని కలెక్టర్‌ పరిశీలించారు. సామగ్రి సంబంధించి రి జిస్టర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. సూపర్వైజర్లు తి న్నాకే విద్యార్థులకు వడ్డించాలని అన్నారు. మండల కేంద్రంలో ఉన్న వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ ధాన్యంని తూర్పు పట్టి తాలు లేకుండా చూడా లన్నారు. కొనుగోలు నిర్వాహ కులపై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులను ఇ బ్బందులకు గురి చేయవద్దని, తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు జరపాలని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆ సుపత్రికి ప్రతీ రోజు ఎంతమంది రోగులు వస్తున్నారని, డా క్టర్‌ కృష్ణకుమారిని అడిగి తెలుసుకున్నారు. పలు రిజిస్టర్‌ల ను ప్రసూతి వార్డును సందర్శించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ నాయక్‌, తహసీల్దార్‌ తిలక్‌ కుమార్‌రెడ్డి, ఆయా శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 06 , 2024 | 11:39 PM