గజ్జి కుక్కల్లా మొరుగుతున్న కేటీఆర్, హరీశ్‌రావు
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:25 PM
పొద్దున లేస్తే బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు గజ్జికుక్కల్లా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై పడి మొరుగుతున్నారని డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాక్యలు చేస్తున్నారన్నారు.
వారికి మానసిక పరిస్థితిపై ప్రభుత్వం ట్రీట్‌మెంట్ చేయించాలి
దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి
మహబూబ్‌నగర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : పొద్దున లేస్తే బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావులు గజ్జికుక్కల్లా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపై పడి మొరుగుతున్నారని డీసీసీ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. విచక్షణ కోల్పోయి ఇష్టానుసారంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాక్యలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వారి మానసిక పరిస్థితి బాగోలేదని, ఇదివరకే తాను వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ట్రీట్‌మెంట్ చేయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ళపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నేతలు వందల కోట్లు సంపాదించి పందికొక్కుల్లా బలిశారని, ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు మాత్రం చేయలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన పాలమూరు రంగారెడ్డికి రూ. 28 వేల కోట్లు ఖర్చుచేసి 28 ఎకరాలకు కూడా నీరివ్వలేని చేతకాని దద్దమ్మలని మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లు అప్పులు చేసినా, ఆర్థిక ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. పాలమూరులోని కురుమూర్తి, మన్యంకొండ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారన్నారు. ఎంతో మంది భక్తులు సందర్శించే కురుమూర్తి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణం కోసం రూ. 110 కోట్లు కేటాయిస్తూ పనులు ప్రారంభించామన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తానని, ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని, పెండింగ్ ప్రాజెక్ట్‌లతో పాటు పాలమూరు రంగారెడ్డి, కోడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకాలు చేపడతానని, ఎవరైనా అడ్డుపడితే తాటతీస్తానని చెప్పినట్లు వివరించారు. పదేళ్ళలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధి లేదని, ప్రచారం మాత్రమే చేసుకున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో నాయకులు వినోద్‌కుమార్, సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, వసంత, సీజే బెనహర్, రాములుయాదవ్ పాల్గొన్నారు.
Updated Date - Nov 11 , 2024 | 11:25 PM