కురుమయ్యా.. మన్నించు
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:30 PM
తిరుమల శ్రీనివాసుని ప్రతిరూపమైన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
- రాజగోపురం పక్కనే అశుద్ధం
- శిథిలమైన ముక్కెరవంశపు రాజుల కాలం నాటి బిల్డింగ్
- స్వామి పాదాల గుహపక్కనే దుర్వాసన వెదజల్లుతున్న వైనం
చిన్నచింతకుంట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీనివాసుని ప్రతిరూపమైన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీనివాసుని ప్రతిరూపంగా పిలువబడుతున్న కురుమూర్తిరాయుడి క్షేత్రం కూడా ఎంతో పరమపవిత్రమైనది. అయితే ఇక్కడ కురుమూర్తిస్వామి గుట్టకింది భాగంలోని ప్రధాన రాజగోపురం పక్కనే ఉన్నటువంటి ముక్కెరవంశపు కాలంలోని బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది. బిల్డింగ్ అంతా కుంగిపోయింది. బీటలు వారుతున్నది. పగుళ్లు ఏర్పడింది. ఎప్పుడు కూలుతుందోనన్న గబులు భక్తులను వెంటాడుతున్న ది. అయితే ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో, అందులోకి భక్తులు మలమూత్రాలు విసర్జించటం పలువురికి విస్మయం కల్గిస్తున్నది. తిరుమల లో స్వామి పాదాలు ఉన్నట్టుగానే శిథిలమైన బిల్డింగ్‌కు పక్కనే గుహలో స్వామి పాదాలు ఉన్నాయి. చాలా మంది భక్తులు పాదాలు దర్శించుకుని, అనంతరం స్వామి వారి గుట్టమీదకు వెళ్లి ఆ కురుమూర్తిరాయుడిని దర్శిం చుకుంటారు. అయితే భక్తుల మనోభావాలకు దెబ్బతీసేవిధంగా పాదాల గుహసమీపంలోనే మలమూత్ర విసర్జనలతో అక్కడ కంపుకొడుతున్నా, దీనిపై అటు అధికారులు, పాలకరవర్గం సభ్యులు, సంబంధిత సిబ్బంది దీ నిపై నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతర మైదానంలో విడిదిచేసే భక్తులు అక్కడే మలమూత్ర విసర్జనలు చేస్తున్నా తమకేం పట్టనట్లుగా సిబ్బం ది వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అధికారుల తీరు నిండా నిర్లక్ష్యంగా కన్పిస్త్నుది. అయితే భక్తులు మలమూత్ర విసర్జనలకు వెళ్లకుండా ఇనుపకంచెలను గుట్టసమీపంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు తెలుపుతున్నారు.
శిథిలమైన బిల్డింగ్‌కు మరమ్మతులు చేపట్టాలి...
రాజగోపురం వద్దగల స్వామి పాదాలచెంతనే మలమూత్రవిసర్జనలు చేయటం బంద్ కావాలంటే అక్కడ శిథిలమైన బిల్డింగ్‌కు మరమ్మతులు చేపట్టి, దానికి రంగులు వేసి, చుట్టూ కంచెను ఏర్పాటు చేసి, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉద్దాల ఉత్సవం వచ్చే సమయంలోనే కాకుండా బ్రహ్మోత్సవాలకు లక్షల మంది భక్తులు అక్కడే విడిదిని ఏర్పాటు చేసుకుని ఉంటారు. అయితే ప్రమాదవశాత్తు బిల్డింగ్ కుప్పకూలితే పెద్ద ప్రాణనష్టం కూడా వాటిల్లే అవకాశం ఉందని భక్తులు ఓకింత ఆందోళన చెందుతున్నారు. ఉద్దాలోత్సవం కూడా ఇక్కడి నుంచే భక్తులు తిలకిస్తారు. ప్రమాదం జరుగకముందే అధికారులు, పాలకరవర్గం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
చాలీచాలని షెడ్లు
కురుమూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భం గా జాతరకు వచ్చే భక్తులకు చాలీచాలని రేకులషెడ్లతో ఇక్కట్లు పడుతున్నారు. కురుమూర్తి స్వామికి అత్యంత ప్రీతిపాత్ర మైనది దాసంగాల నైవేద్యం. అయితే ఈ దాసంగాలు వం డేందుకు నిలువనీడ కూడా కరువైంది. దాంతో భక్తులు జాతర మైదానంలోని చెట్లను ఎంచుకుంటున్నారు. భక్తుల రద్దీకి తగ్గ షెడ్లు లేకపోవటంతో తీవ్ర ఇ బ్బందులకు గురౌతున్నామని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి ఏటా కోట్లలో స్వామి వారికి ఆదాయం సమకూరుతు న్నా, భక్తులకు సౌకర్యాలు క ల్పించటంలో అటు దేవాదాయ శాఖ, పాలకవర్గం దృష్టి సారించటం లేదన్న విమర్శ లున్నాయి. ఒక వేల వర్షం వచ్చిందంటే భక్తులకు మరింత ఇబ్బం దులు తప్పవు. అయితే అధికారులు, పాలకవర్గం సభ్యులు భక్తుల సౌకర్యార్థం మరిన్ని రేకుల షెడ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.
Updated Date - Nov 04 , 2024 | 11:30 PM