ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను కలిసిన నాయకులు

ABN, Publish Date - Oct 23 , 2024 | 11:24 PM

జిల్లాలో పదకొండు మంది జీహెచ్‌ ఎంల స్పౌజ్‌ పాయింట్ల విషయం లో తప్పిదాలు చేశారన్న విషయం లో సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే.

ఆర్జేడీ కార్యాలయంలో ఏడీకి వినతి పత్రం అందజేస్తున్న వివిధ సంఘాల నాయకులు, సస్పెండ్‌ అయిన జీహెచ్‌ఎంలు

- సస్పెన్షన్‌పై పునఃపరిశీలించాలి: ఆర్జేడీ కార్యాలయంలో ఏడీకి వినతి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదకొండు మంది జీహెచ్‌ ఎంల స్పౌజ్‌ పాయింట్ల విషయం లో తప్పిదాలు చేశారన్న విషయం లో సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ పీ ఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి జిల్లా టీఎస్‌ఎజీహెచ్‌ఎంఏ అధ్య క్షుడు జగదీష్‌కుమార్‌, నాయకు లు కురుమూర్తి, అనంతప్ప, సస్పెన్షన్‌కు గురైన జీహెచ్‌ఎంలు హైదరాబాద్‌లో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ నరసింహారెడ్డిని బుధవారం కలిసి పునఃపరిశీలించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ నర్శింహారెడ్డి మాట్లాడుతూ ఎ లాంటి తప్పు చేయకుండా పారదర్శకంగా ఉం టే అలాంటి వారికి ఇబ్బంది లేదని ఏమైనా ఇ బ్బందులు ఉంటే ఆర్జేడీకి విన్నవించాలని సూ చింనట్లు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అనంతరం ఆర్జేడీ కార్యాలయంలో తెలంగాణ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు, యు గేందర్‌రెడ్డి, భూపతి సింగ్‌, జీహెచ్‌ఎం సంఘం నాయకులు జగదీష్‌, అబ్ధుల్‌హక్‌, సస్పెండ్‌ అ యిన జీహెచ్‌ఎంలు ఆర్జేడీ అందుబాటులో లేక పోవడంతో కార్యాలయంలో ఏడీకి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు .

ఉపాధ్యాయుల్లో గుబులు

స్పౌజ్‌ పాయింట్ల తప్పిదాలు చేసిన జీహెచ్‌ ఎంలు జిల్లాలో 11 మంది సస్పెండ్‌ కావడంతో ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. జూలై నెలలో జరిగిన ఉపాధ్యాయ బదిలీలలో కొంద రు స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు స్పౌజ్‌ పాయింట్ల దుర్వినియోగం చేసిన ఉపా ధ్యాయుల ఫైల్స్‌ తెరపైకి తీసుకువస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్స్‌ను డీఈవో రవీం దర్‌ పరిశీలించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పటికే స్పౌజ్‌ పాయింట్ల తప్పిదాల ఆరోపణలు ఉన్న ఉపాధ్యాయులకు మహబూ బ్‌నగర్‌, జడ్చర్ల తదితర మండలాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆరోపణ లు ఉన్న ఉపాధ్యాయుల నుంచి ఇప్పటికే వివ రణ కూడా కోరారు. ఇందుకు గాను విద్యాశాఖ కమిటీలు కూడా వేసింది. కమిటీ సభ్యులు త్వ రగా రిపోర్టు ఇవ్వాలని ఇప్పటికే డీఈవో ఆదే శించారు. దీని ఆధారంగా ఆరోపణలు ఎదు ర్కొంటున్న టీచర్లు తప్పని తేలితే చర్యలు తీసకునే అవకాశం ఉందని డీఈవో తెలిపారు .

Updated Date - Oct 23 , 2024 | 11:24 PM