గాంధీ మార్గంలో నడుద్దాం
ABN, Publish Date - Dec 07 , 2024 | 11:22 PM
మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుద్దామని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి పిలుపు నిచ్చారు.
- ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి
- గంగాపురంలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ
జడ్చర్ల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుద్దామని జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి పిలుపు నిచ్చారు. మండలంలోని గంగాపురంలో శనివారం మహాత్మాగాంధీ విగ్రహన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతకుముందు లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ ట్రస్టీలుగా నియమించిన 13 మందిని దేవాదాయశాఖ అధికారి వీణాధరి ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ ఈవో దీప్తిరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.
అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే..
గంగాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్ర మాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. చెస్ట్‌లో నొప్పిగా ఉండడంతో జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి వచ్చి, వై ద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు ఈసీజీ, బీపీ పరీక్షలు నిర్వ హించగా, ఎలాంటి నెగెటివ్ రిపోర్ట్ లేకపోవడం తో కొంత విశ్రాంతి తీసుకోవాలని ఎమ్మెల్యేకు వైద్యులు సూచించారు. దీంతో రంగారెడ్డిగూడలో విశ్రాంతి తీసుకున్న అనంతరం తిరిగి మిడ్జిల్ పర్యటనకు బయలుదేరారు.
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం..
మిడ్జిల్ : బీఆర్‌ఎస్ పాలనలో ఆభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్చర్ల నియోజకవర్గానికి అత్యధిక నిధులను తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని రూ.13.35 లక్షలతో సీసీ రోడ్డు, భైరంపల్లిలో రూ.8.90 లక్షలతో సీసీ రోడ్డు, దోనూర్‌లో రూ.17.8 లక్షలతో సీసీ రోడ్డు, చిలువేరులో రూ.12 లక్షలతో అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా మిడ్జిల్‌లో రూ.13.35 లక్షలతో కేజీవీబీ పాఠశాల ఆవరణలో నిర్మించనున్న సీసీ రోడ్డు, మిడ్జిల్ నుంచి కొత్తపల్లి గ్రామం వరకు రూ.25 కోట్లతో డబుల్‌రోడ్డు, మసిగుండ్లపల్లిలో రూ.17.8 లక్షలతో సీసీ రోడ్డు, బోయిన్‌పల్లి గ్రామంలోని రూ. 3.50 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. గతంలో మాదిరిగా తాము ఎన్నికల ముందు కొబ్బరి కాయలు కొట్టి మరిచిపోయే నాయకులం కాదని, ప్రతీ పని పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాటికి శ్రీహరికి మంత్రి పదవి రావడం ఖాయం అన్నారు. మార్కెట్ ఛైర్మన్ జ్యోతి అల్వాల్‌రెడ్డి, నాయకులు రబ్బాని, బరిగెల వెంకటయ్య, గౌస్, మల్లికార్జున్‌రెడ్డి, సాయిలు, రాముగౌడ్, కృష్ణయ్యగౌడ్, కృష్ణయాదవ్, మల్లేష్, లాలు, పర్వతాలు, జహాంగీర్, ఉస్మాన్, జహీర్, వెంకట్‌రెడ్డి, శ్రీనువాసులు, ఆదాం, రమేష్, పాండు పాల్గొన్నారు.
Updated Date - Dec 07 , 2024 | 11:22 PM