ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విజ్ఞానాన్ని పెంచే గ్రంథాలయాలను వినియోగించుకోవాలి

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:01 PM

విజ్ఞానాన్ని పెంచే గ్రంథాలయాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి అన్నారు.

పేటలోని గ్రంథాలయంలో పత్రికలు చదువుతున్న వార్ల విజయ్‌కుమార్‌, ప్రముఖులు

- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌

- పేట, కోస్గిలలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

నారాయణపేట/కోస్గి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): విజ్ఞానాన్ని పెంచే గ్రంథాలయాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను వారు ప్రారంభించి, ప్రసంగించారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రోజూ ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. 15వ తేదీన పుస్తక ప్రదర్శన, 16న వాతావరణం, కాలుష్య నివారణపై విద్యా ర్థులకు వ్యాసరచన పోటీలు, 18న స్వాంతంత్య్ర సమరయోధులపై చిత్రలేఖనం పోటీలు, 19న మహిళా దినోత్సవం సందర్భంగా ముగ్గుల పోటీలు, 21న బహుమతుల ప్రదానం నిర్వహిస్తామ న్నారు. అంతకుముందు బాలల దినోత్సవం సందర్భంగా చాచా నెహ్రూ, సరస్వతీదేవి చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కోనంగేరి హన్మంతు, మార్కెట్‌ డైరెక్టర్‌ శరణప్ప, కౌన్సిలర్‌ సలీం, కాంగ్రెస్‌ నాయకులు గందే చంద్రకాంత్‌, బండి శివరామ్‌రెడ్డి, బండి గోపాల్‌రెడ్డి, జలీల్‌, అనంత్‌రెడ్డి, లైబ్రేరియన్లు శిల్ప, భారతి, సిబ్బంది రఘు తదితరులున్నారు. అదేవిధంగా, కోస్గిలో గ్రంథాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌ వారోత్సవాలు ప్రారంభించారు. నేటి నుంచి పాఠశాలల విద్యార్థులకు గ్రంథాలయంలో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామన్నారు. వారోత్సవాలు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సహకరించి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు వీరమల్లేష్‌, గ్రంథాలయ సిబ్బంది నర్సిములు తదితరులున్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:01 PM