ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూపు

ABN, Publish Date - Sep 15 , 2024 | 10:43 PM

వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో రెండున్నర దశాబ్దాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంల పరిస్థితి అధ్వానంగా మారింది.

ఖిల్లాఘణపురం పీహెచ్‌సీలో వైద్య సేవలు అందిస్తున్న రెండో ఏఎన్‌ఎంలు

ఖిల్లాఘణపురం, సెప్టెంబరు 15: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో రెండున్నర దశాబ్దాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎంల పరిస్థితి అధ్వానంగా మారింది. చాలీ చాలని వేతనాలతో జీవి తాన్ని నెట్టుకొస్తు ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూస్తు న్నారు. దశల వారీగా ఉద్యోగాలను క్రమబద్దీకరించాల్సి ఉండగా పట్టించుకునే వారు లేకపోవడంతో పని ఒత్తిడితో వెట్టిచాకిరి చేస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో జాతీయ ఆరోగ్య మిషన్‌ రాష్ట్ర ప్రభుత్వం సం యుక్తంగా ఆరోగ్య ఉప కేంద్రాలు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రెండో ఏఎన్‌ఎంలను కాంట్రాక్టు ప్రాతిపది కన నియమించారు. 2001 నుంచి ప్రతీ ఏడాది దశల వారీగా నియామకాల ప్రక్రియ చేపట్టారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దివంగత ముఖ్య మంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కొంతమంది ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయగా 2011లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నామమాత్రంగా 35 మంది ఏఎన్‌ఎంలకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్‌ ప్రక్రి యను నిలిపివేశారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వాలు స్పందించడం లేదు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెల రోజుల పాటు ఉద్యోగ భద్రత కోసం సమ్మే చేయడంతో ప్రభుత్వం సమ్మే కాలానికి జీతం సైతం చెల్లించలేదు. ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల నేతలు రెగ్యులర్‌ చేస్తామని ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన వెం టనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 74 మంది రెండో ఏఎన్‌ఎంలు రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాలుగు గ్రామాలు ఉంటే రెండు గ్రా మాలు రెగ్యులర్‌ మరో రెండు గ్రామాల బాధ్యతలను కాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు కేటాయించారు. వీరి మధ్య వేత వ్యత్యాసం మాత్రం చాలా ఉంది. నెలకు అంది స్తున్న రూ.27,300 వేతనం సరిపోవడం లేదని, ఏరి యల్స్‌ అమౌంట్‌ సైతం ఇవ్వడం లేదని రెండో ఏఎన్‌ ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఏఎన్‌ఎం రెండు, మూడు గ్రామాలలో వైద్య సేవలు అందించ డానికి కేటాయించారు. కానీ రెగ్యులర్‌ ఏఎన్‌ఎంలకు రవాణా కోసం ఎఫ్‌టీఏ బిల్లులు చెల్లించి ాంట్రాక్టు ఏఎన్‌ఎంలకు చెల్లించడం లేదు. జిల్లాలో వ్యాక్సినేషన్‌ డబ్బాలు తరలించడానికి వ్యాక్సిన్‌ క్యారియర్‌ అమౌం ట్‌ సైతం ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వైద్య, ఆరోగ్య శాఖకు ఆన్‌లైన్‌లో వివరాలు పంపించడానికి, స్టేషనరీకి సైతం బిల్లులు చెల్లించడం లేదని సొంత డబ్బులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పని ఒత్తిడి పెరగడంతో అనారోగ్యానికి గురై కాంట్రాక్టు ఏఎన్‌ఎం లు మృత్యువాత పడుతున్నారు. రెండేళ్ల క్రితం వనపర్తి జిల్లా ఆత్మకూరుకు చెందిన రెండో ఏఎన్‌ఎం లక్ష్మి సైతం పని ఒత్తిడిని తట్టుకోలేక మరణించినట్లు రెండో ఏఎన్‌ఎంలు గుర్తు చేస్తున్నారు. పక్క గ్రామాల కు వెళ్లి వైద్యసేవలు అందించడానికి సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలం పాటు ఏఎన్‌ఎంలుగా వైద్య సేవలు అందించిన చాలా మందికి వయసు పైబడుతుందని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్‌ చేస్తే ప్రయోజనం ఉంటుందని రెండో ఏఎన్‌ఎంలు కోరుతున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 10:43 PM

Advertising
Advertising