సదస్సుకు వెళ్లే రైతులకు ఏర్పాట్లు చేయండి
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:39 PM
మహబూబ్‌నగర్‌లో శనివారం జరిగే రైతు పండుగ సంబరాల సదస్సుకు జిల్లా నుంచి బయలు దేరే రైతులకు అన్ని రకాల ఏర్పా ట్లు పకడ్బందీగా చేపట్టాలని కలె క్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 29, (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌లో శనివారం జరిగే రైతు పండుగ సంబరాల సదస్సుకు జిల్లా నుంచి బయలు దేరే రైతులకు అన్ని రకాల ఏర్పా ట్లు పకడ్బందీగా చేపట్టాలని కలె క్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్ర వారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అదన పు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి రైతు పం డుగ సంబరాలకు తరలి వెళ్లే రైతులకు చేయా ల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క లెక్టర్ మాట్లాడారు. ఇందుకోసం ఎంపీడీవోలు, ఎంఏవోలు నోడల్ అధికారులుగా ఉంటారన్నారు. రైతులకు మధ్యాహ్న భోజనానికి ప్రత్యేకంగా ఏ ర్పాట్లు చేయాలని సూచించారు. యాదయ్య, వెం కటేశ్వర్లు, గోవింద్, ఉమాదేవి పాల్గొన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:39 PM