ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుటీర పరిశ్రమగా కృత్రిమ ఇసుక తయారీ

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:21 PM

అనుమతులు లేకుం డానే యథేచ్ఛగా కుటీర పరిశ్రమ మాదిరిగా ఏర్పాటు చేసుకొని లక్షల్లో కాసులు కూడబెట్టుకుం టున్నారు. మండలంలో ఇసుక మాఫియా తీరిది.

రాందాసు చెరువుతండా వద్ద ట్రాక్టర్‌లో మట్టిని ఫిల్టర్‌ చేసి ఇసుకగా తయారు చేస్తున్న వ్యక్తి

అడ్డాలుగా నల్లగుట్ట, రాందాస్‌చెరువు తండాలు

జిల్లా కేంద్రం సమీపంలో కేంద్రాల ఏర్పాటుతో మాఫియా జోరు

భూత్పూర్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఏవ్యాపారం చేయాలన్నా ప్రభుత్వం నుంచి, సం బంధిత శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుం ది. కానీ కొందరు ఎలాంటి అనుమతులు లేకుం డానే యథేచ్ఛగా కుటీర పరిశ్రమ మాదిరిగా ఏర్పాటు చేసుకొని లక్షల్లో కాసులు కూడబెట్టుకుం టున్నారు. మండలంలో ఇసుక మాఫియా తీరిది. దీనిని ఎవరైనా ప్రశ్నించినా, అడ్డుపడి నా దాడు లకు పాల్పడుతున్నారు.భూత్పూర్‌ మునిసిపాలిటీ కేంద్రంలోని నల్లగు ట్ట, రాందాసుచెరువు తండాల పరిసరాల్లో ఇసుక ఫిల్టర్ల తయారీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారుల కనుసైగల్లో ఈ వ్యాపారం మూడుపువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి. ప్రతి రోజు వం దల టన్నుల్లో కృత్రిమ ఇసుక జిల్లా కేంద్రానికి స రఫరా చేస్తూ రూ.లక్షల్లో కాసులు కూడబెట్టుకుం టున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తెచ్చి స్థానికంగా ఉన్న చెరువుల్లో, బోరు బావుల వద్ద కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో భారత్‌బెంజ్‌ వంటి భారీ వాహనా ల్లో, ట్రాక్లర్లల్లో జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. రాందాసు తండాసమీపంలో ఉన్న చెరువులో నీటిని వాడుకొని ట్రాక్టర్ల ద్వారా తెచ్చిన మట్టిని శుభ్రం చేస్తారు. దీనితో చెరువునీరు కలుషితమ వుతున్నాయి. చేపలు చనిపోయే పరిస్థితి ఏర్పడిం దని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ బావులకు ఉన్న విద్యుత్‌ కనెక్ష న్లను కృత్రిమ ఇసుక తయారీకి వాడుకుంటున్నా రు. ఈ విషయం విద్యుత్‌ శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకో వడం లేదు. ప్రతి రోజు వేలాది టన్నుల కృత్రిమ ఇసుకను తాయారు చేసి సొమ్ము చేసుకుంటున్న ఇసుక మాఫియా వాల్టా చట్టం నిబంధనలను విస్మరిస్తు న్నారు. ఈ దందా గురించి తెలిసినప్పటికీ రెవె న్యూ, మైనింగ్‌ శాఖ అధికారులు నోరు మెదప డంలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. పోలీసు, రెవెన్యూ, విద్యుత్‌ శాఖల అఽధికారు లు ముకుమ్మడిగా అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మోసపోతున్న గృహ నిర్మాణదారులు

ఇంటి నిర్మాణాలకు ఇసుకను కొనుగోలు చేస్తు న్న వారు కృత్రిమ ఇసుక తయారీ మాఫియా చే తుల్లో మోసపోతున్నారు. వాగునుంచి ఇప్పుడే తెచ్చామని చెబుతూ డబ్బులు పెద్దమొత్తంలో దండుకుంటున్నారు. ట్రాక్టర్‌ ఇసుకను రూ.6వేల నుంచి 10వేల వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్‌ ఇసుకను రూ.20 నుంచి 35వేల వరకు విక్రయి స్తున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో నిర్మాణా ల్లో ఇబ్బందులు తలెత్తనున్నాయి.

కుంటలు, గుట్టలు గుల్ల

కృత్రిమ ఇసుక తయారీకి ముడి సరుకుగా గుట్టలు, చెరువులను వాడుతున్నారు. నల్లగుట్ట మట్టిని తరలించి గుట్టను కరగదీశారు. అమిస్తా పూర్‌, హస్నాపూర్‌, పోతులమడుగు, భూత్పూర్‌ ప్రాంతాల్లో గుట్టలనుంచి మట్టిని తరలించారు. ఆదివారం, ఇతర ప్రభుత్వ సెలవురోజుల్లో ఇష్టారా జ్యంగా మట్టిని తరలిస్తున్నారు. ఈవిషయమై ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా కృత్రిమ ఇసుక తయారీ కేంద్రాల విషయం మా దృష్టికి రాలేదన్నారు. ఇసుక, మట్టి తరలింపును రెవెన్యూ అధికారులు చూడాల్సి ఉంటుంది. మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాము.

Updated Date - Nov 10 , 2024 | 11:22 PM