ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాష్ట్ర స్థాయిలో మక్తల్‌ విద్యార్థుల ప్రతిభ

ABN, Publish Date - Jun 10 , 2024 | 10:58 PM

ఈనెల ఆరు, ఏడు తేదీల్లో వరంగల్‌ జిల్లా హన్మకొండలో 10వ రాష్ట్ర స్థాయి సీనియర్‌, కిడ్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో మక్తల్‌ ఈనాడు లక్ష్య క్రీడాకారులు ప్రతిభ కనబచ్చడంతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సోమవారం విద్యార్థులను సన్మానించారు.

విద్యార్థులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, జూన్‌ 10 : ఈనెల ఆరు, ఏడు తేదీల్లో వరంగల్‌ జిల్లా హన్మకొండలో 10వ రాష్ట్ర స్థాయి సీనియర్‌, కిడ్స్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో మక్తల్‌ ఈనాడు లక్ష్య క్రీడాకారులు ప్రతిభ కనబచ్చడంతో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సోమవారం విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్‌ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది క్రీడాకారులు ఉన్నారని, వారిని క్రీడల్లో ప్రోత్సహిస్తే రాష్ట్ర స్థాయిలో రాణిస్తారన్నారు. మక్తల్‌ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ఏడు పతకాలు, చిట్యాల గ్రామానికి చెందిన నలుగురు పతకాలు సాధించినట్లు కోచ్‌ జగదీష్‌ తెలిపారు. లాంగ్‌జంప్‌లో భరత్‌ బంగారు పతకం, మౌలాలీ లాంగ్‌జంప్‌లో వెండి పతకం, మహేష్‌, వరుణ్‌ వెండి పతకాలు, పార్వతీ లాంగ్‌జంప్‌లో బ్రంజ్‌ మెడల్‌, 50 మీటర్ల విభాగంలో సిల్వర్‌ మెడల్‌, విష్ణు లాంగ్‌జంప్‌లో బ్రౌంజ్‌ మెడల్‌, అరవింద్‌ వంద మీటర్లలో వెండి పతకం, బసంత్‌ 400 మీటర్ల విభాగంలో బంగారు పతకం, జనార్దన్‌ హైజంప్‌లో బంగారు, 110 మీటర్ల విభాగంలో వెండి పతకం సాధించినట్లు కోచ్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేష్‌ శెట్టి, కాంగ్రెస్‌ నాయకులు గవినోళ్ల బాలకృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, రవికుమార్‌, రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 10:58 PM

Advertising
Advertising