ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

ABN, Publish Date - Oct 01 , 2024 | 10:54 PM

గట్టు మండలంలోని గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మిషన్‌ భగీరథ అధికారులకు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- మిషన్‌ భగీరధ అధికారులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల న్యూటౌన్‌/ గద్వాల టౌన్‌, అక్టోబరు 1 : గట్టు మండలంలోని గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మిషన్‌ భగీరథ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మిషన్‌ భగీరథ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో మరమ్మతులు పూర్తి చేయాలని, మూడో మోటర్‌ను బిగించి, నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు మిషన్‌ భగీరథ అధికారులు స్పందిస్తూ వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఎస్‌ఈ వెంకటరమణ, గ్రిడ్‌ ఈఈ పరమేశ్వర్‌, ఇంట్రా ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈఈ రవిచంద్ర, పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌కు సన్మానం

జిల్లా గ్రంధాలయ సంస్ధ నూతన చైర్మన్‌ నీలి శ్రీనివాసులు మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూడా ఆయనను ఘనంగా సన్మానిం చారు. అనంతరం నీలి శ్రీనివాసులు మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ను ఆయన నివాసంలో కలిసి, పుష్పగుచ్ఛం అందించారు.

Updated Date - Oct 01 , 2024 | 10:54 PM