మెట్రుగుంట గ్యాంగ్ దొంగ అరెస్ట్
ABN, Publish Date - Nov 23 , 2024 | 11:16 PM
బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాటు వేసి నగదు డ్రా చేసుకునే వారిని అనుసరించి డబ్బులు ఎత్తికెళ్లిన మెట్రుగుంట ముఠా సభ్యుడిని గద్వాల పోలీసు లు అరెస్ట్ చేశారు.
రూ. 3.10 లక్షలు రికవరీ
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో ఇద్దరికి రిమాండ్
విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాటు వేసి నగదు డ్రా చేసుకునే వారిని అనుసరించి డబ్బులు ఎత్తికెళ్లిన మెట్రుగుంట ముఠా సభ్యుడిని గద్వాల పోలీసు లు అరెస్ట్ చేశారు. ఎస్పీ శ్రీనివాసరావు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల ్లడించారు. ఈ నెల 7న అలంపూర్ మండలం ఇమామ్‌పు రం గ్రామానికి చెందిన కుర్వ సిద్దన్న, ఆయన కుమా రు డు జితేందర్ ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బులు రూ. 3.60 లక్షలను కారులో ఉంచి కలెక్టరేట్ ఎదురుగా హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. గుర్తుతెలియని దొంగలు కారు అద్దాన్ని పగులకొట్టి అందులో ఉన్న రూ. 3.60 లక్షలను ఎత్తికెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మూడు ప్రత్యేక బృందాలతో గా లింపు చర్యలు చేపట్టాము. శనివారం ఉదయం ఎర్ర వల్లి చౌరస్తాలో అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గద్వాల పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి అతడి నుంచి రూ. 3.10ల క్షలను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు జిల్లా, బోగోలు మండంల, కప్పట్రాల తిప్ప బిట్రగుంటా గ్రామానికి చెందిన ప్రసంగి గా గుర్తించాము. గతంలో ఇలాంటి దొంగతనం కేసులో తిరుపతిలో ఆయనపై కేసు నమోదు చేశారని, ఈ కేసులో జైలుకు కూడా వెళ్లాడని తెలిపారు. ఇతడు మెట్రుగుంట గ్యాంగ్‌లో ఓ సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. అదేవిధంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యో గాలు ఇస్తానని డబ్బులు వసూలు చేసిన అంకితను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అదే విధంగా గద్వాల హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు వసూలు చేసిన గుర్రం యువరాజును అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ నెల 16న విశ్వసనీయ సమాచారం మేరకు గద్వాల మండలంలోని వెంకంపేట సమీపంలో యువరాజును పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. కేసులు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐలు కల్యాణ్‌కుమార్, శ్రీకాంత్, సిబ్బందికి ఎస్పీ రివార్డు అందించి సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐ టంగుటూరి శ్రీను, పట్టణ, రూరల్ ఎస్‌ఐలు కల్యాణ్‌కుమార్, శ్రీకాంత్ ఉన్నారు.
Updated Date - Nov 23 , 2024 | 11:16 PM