ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాములోరి కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి దంపతులు

ABN, Publish Date - Apr 17 , 2024 | 11:05 PM

జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీ సీతారామస్వామి ఆలయంలో రాములోరి క ల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహిం చారు.

నాగర్‌కర్నూల్‌లోని సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, హైకోర్టు జడ్జి మాధవీదేవి దంపతులు

నాగర్‌కర్నూల్‌ టౌన్ల్‌, ఏప్రిల్‌ 17: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌ కాలనీ సీతారామస్వామి ఆలయంలో రాములోరి క ల్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. కల్యాణ మహోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి సరిత దంపతులు, హైకోర్టు జడ్జి మాధవీదేవి హన్మంత్‌రెడ్డి దంపతులు ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్ర్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు అబిజిత్‌ లగ్న శుభ ముహుర్తాన ఆ లయ ప్రధాన అర్చకులు శ్రీకందాడై వరదాచార్యులు నేతృత్వంలో వేద పండితుల సీతారాముల కల్యా ణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ ప్రజలందరికీ శ్రీరామనవ మి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి ఆ శీస్సులు ఉండాలన్నారు. అలాగే వేసవి సందర్భంగా పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడా లని ప్రార్ధించారు. స్వామి వారి కల్యాణంలో పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అర్చకుల కల్యాణ తంతుని తిలకించారు. క ల్యాణం జరుగుతున్న స మయంలో ఆలయ ప్రాం గణమంతా శ్రీరామ నామ స్మరణతో మార్మోగింది. అనంతరం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రా జేష్‌రెడ్డి, హైకోర్టు జడ్జి మాధవీదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. శ్రీసీతారామ కల్యాణం సందర్భంగా భక్తులకు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేయగా వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో పండ్లు, మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బిల్లకంటి హరిబాబు, సభ్యులు హకీం సుదర్శన్‌, ఆకారపు విశ్వ నాథం, స్థానిక కౌన్సిలర్‌ బాదం సునీత నరేందర్‌, మున్నూరు కాపు సంఘం కార్యదర్శి పాలమూరు సతీష్‌, కోశాధికారి తీగల జగదీష్‌, ప్రవీణ్‌ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 11:05 PM

Advertising
Advertising