విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
ABN, Publish Date - Nov 10 , 2024 | 11:34 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు మెరుగైన విద్య అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, కిరణ్ అన్నారు.
మక్తల్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు మెరుగైన విద్య అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్, కిరణ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని విద్యార్థి అమర వీరుల సభను పీడీఎస్‌యూ ఆద్వర్యంలో నిర్వహి ంచారు. సభకు వారు ముఖ్య అతిథులుగా పా ల్గొని మాట్లాడారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు సమానమైన శాస్త్రీయ విద్య అందించాలన్నారు. విద్యార్థి ఉద్యమంలో అమ రవీరులైన జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్, ప్రసా ద్, శ్రీహరి, కోళ్ల శంకర్, రంగవల్లి స్నేహలత ఆశయాలను కొనసాగించాలన్నారు. కొఠారి కమి షన్ ప్రకారం విద్యారంగానికి జాతీయ స్థూల ఉత్పత్తిలో ఆరుశాతం, కేంద్రం బడ్జెట్‌లో పది శా తం, రాష్ట్ర బడ్జెట్‌లో 30శాతం ఇవ్వాలని ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కేంద్రం విద్యను కాషా యీకరణ చేసేందుకు పూనుకుందన్నారు. కార్య క్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి సంద్య, భగవంతు, బుట్టో, అజయ్, శేఖర్, చెన్నప్ప, గణేష్, రాకేష్, తిమోతి, పుష్పలత, అనూష, అఖిల, నవిత, రాధిక, స్వాతి, రమేష్, ఆనంద్, వెంకటేష్ పాల్గొన్నారు.
Updated Date - Nov 10 , 2024 | 11:34 PM