బతుకమ్మ సంబురాలతో నూతనోత్తేజం
ABN, Publish Date - Oct 01 , 2024 | 10:50 PM
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ సంబురాలు ప్రజలు, విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి ఆకాంక్షించారు.
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి
- జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు వేడుకలు
గద్వాల టౌన్/ మానవపాడు/ వడ్డేపల్లి/ ధరూరు/ మల్దకల్/ ఇటిక్యాల, అక్టోబరు 1 : తెలంగాణ సంస్కృ తికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మ సంబురాలు ప్రజలు, విద్యార్థుల్లో నూతనోత్తేజాన్ని నింపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి ఆకాంక్షించారు. జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మంగళ వారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి గౌరమ్మ పూజలు చేశా రు. బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు న్యాయాధికారి గంట కవితాదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ వెంకట నర్సయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు కోలాహలంగా కొనసాగాయి. ప్రగతి పాఠశాల, దయానంద విద్యా మందిర్‌లలోనూ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్, ఎస్‌వీఆర్ పాఠశాల, వడ్డేపల్లి మండల పరిధిలోని వెంకట్రామ్‌నగర్ ప్రభుత్వ ప్రాథ మిక పాఠశాల, రామాపురం ప్రాథమిక పాఠశాల, శాంతి నగర్ ఎంపీపీ, శ్రీలక్ష్మీ కాన్సెప్ట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఇటిక్యాల మండలం పెద్దదిన్నె, రాజోలి మండలం ముండ్ల దిన్నె గ్రామాల్లోని పాఠశాలల్లో వేడుకలు నిర్వహించారు.
Updated Date - Oct 01 , 2024 | 10:50 PM