జోగుళాంబకు పట్టువస్ర్తాలు సమర్పణ
ABN, Publish Date - Oct 06 , 2024 | 11:34 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టువస్ర్తాలను సమర్పించింది.
- ప్రత్యేక పూజలు చేసిన కర్నూల్ కలెక్టర్ దంపతులు
అలంపూర్, అక్టోబరు 6 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టువస్ర్తాలను సమర్పించింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాదిలాగే కర్నూలు కలెక్టర్ పి.రజత్బాషా కుటుంబ సమేతంగా హాజరై స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను సమర్పించారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి సాదర స్వాగతం పలికి ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను అందజేశారు.
Updated Date - Oct 06 , 2024 | 11:34 PM