ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొంగి పొర్లుతున్న వాగులు

ABN, Publish Date - Sep 06 , 2024 | 11:42 PM

జిల్లాలోని నాలుగు మండలాల్లో గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి.

ఎర్రవల్లి మండలంలో పొంగిపొర్లుతున్న గార్లపాడు వాగు, ఇటిక్యాల మండలం సాతర్లలో నీట మునిగిన మిరప పంట

- అలుగు పారుతున్న చెరువులు

- నాలుగు మండలాల్లో భారీ వర్షం

- నీట మునిగిన పంటలు

గట్టు/ ఉండవల్లి/ ఎర్రవల్లి/ ఇటిక్యాల, సెప్టెంబరు 6 : జిల్లాలోని నాలుగు మండలాల్లో గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొరలుతున్నాయి. గట్టు మండలంలోని నోటిఫైడ్‌ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. మాచర్ల, సల్కాపురం, బోయలగుడ్డం, ఇదువాసి, బల్గెర చెరువుల్లోకి భారీతా నీరు చేరింది. మంగళవారం 66.4, బుధవారం 7.2, శుక్రవారం 48.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

- ఉండవల్లి మండలంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 43.6 మిల్లీమీర్ల వర్షపాతం నమోదయ్యింది. మండలంలోని నీలమ్మ, అనసూయమ్మ, చిన్న ఆముదాలపాడులోని డొంగు వాగు, ప్రాగటూర్‌ - మారమునగాల మధ్యనున్న వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బైరాపురం - బస్వాపురం మధ్యనున్న వాగు పొంగిపోర్లుతోంది. బైరాపురం, బస్వాపురం గ్రామాల్లో రహదారులు బురుదమయంగా మారడంతో కర్నూలు - అలంపూర్‌ ఆర్‌టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. డి.బూడిదపాడు, బైరాపురం, బస్వాపురం శివారుల్లో కంది, మొక్కజొన్న, ఉల్లి పంటలు నీట మునిగాయి.

- ఉమ్మడి ఇటిక్యాల మండలంలో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఎర్రవల్లి మండల పరిధిలోని రాజశ్రీ గార్లపాడు, వల్లూరు వాగులు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గార్లపాడులో గురువారం రాత్రి ఇళ్లలోకి నీరు చేరింది. వాగులు ఉధృతంగా ప్రవహస్తుండటంతో ఉపాధ్యాయులు గ్రామాలకు వెళ్లడం కష్టతరమైంది.

- ఇటిక్యాల మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వల్లూరు, సాతర్ల, ఉదండాపురం, ఇటిక్యాల గ్రామాలు వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రయాణీకులు వాగులను దాటలేక ఇబ్బంది పడ్డారు. సాతర్ల, ఉదండాపురం, ఇటిక్యాల గ్రామాల్లో కంది, మిరప, పత్తి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. సాతర్ల శివారులోని పొలాల్లో మిరప పంట నీటమునిగింది. మండల కేంద్ర సమీపంలోని వాగు నీరు నారాయణపురం ఆర్‌యూబీ కింద నిల్వడంతో అధికారులు మోటార్లు ఏర్పాటు చేసి నీరు తోడివేయిస్తున్నారు. ఇటిక్యాలలో 80.3, కోదండాపురంలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

Updated Date - Sep 06 , 2024 | 11:42 PM

Advertising
Advertising