పెండింగ్ పాలబిల్లులు వెంటనే చెల్లించాలి
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:34 PM
పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల పాలబిల్లులు వెం టనే చెల్లించాలని రైతుసంఘాల ప్రతినిధులు కోరారు.
- పాలమూరులో విజయ డెయిరీ ఎదుట పాల రైతుల ధర్నా
పాలమూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఆరు నెలల పాలబిల్లులు వెం టనే చెల్లించాలని రైతుసంఘాల ప్రతినిధులు కోరారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రం లోని విజయడెయిరీ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఎండీ శ్రీనివాసరెడ్డి హయాంలో పాల రైతులకు రెగ్యులర్‌గా బిల్లులు చెల్లించేవారని అన్నారు. ఆ విధానాన్ని ఎందుకు అమలు చేయ టంలేదని ప్రశ్నించారు. గతంలో 30లక్షల లీటర్ల పాలు విక్రయించే రైతులు, ప్రోత్సాహం లేక కేవలం రెండులక్షల లీటర్ల పాలు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు.
Updated Date - Nov 05 , 2024 | 08:57 AM