ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోళ్ల పందెం స్థావరంపై పోలీసుల దాడి

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:05 PM

కోళ్ల పందెం స్థావరంపై మెరుపు దాడి చేసి, పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బుర్రి గోవర్ధన్‌ ఆదివారం తెలిపారు. బిజినేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బిజినేపల్లి, సెప్టెంబరు 15: కోళ్ల పందెం స్థావరంపై మెరుపు దాడి చేసి, పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ బుర్రి గోవర్ధన్‌ ఆదివారం తెలిపారు. బిజినేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం మంగనూర్‌ శివారులోని చింతలబండ సమీపంలో కోళ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని చెప్పారు. తిమ్మాజిపేట మండలం చేగుంటకు చెందిన గంటల నరేష్‌ ఆధ్వర్యంలో పందేలు నిర్వహిస్తున్నట్లు తెలియడంతో సీఐ కనకయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐలు నాగశేఖర్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డితో పాటు 20 పోలీసు సిబ్బంది దాడులు చేశారని తెలిపారు. పది మందిని అదుపులోకి తీసుకోగా, మరో 20 మంది పరారైనట్లు వివరించారు. పట్టుపడ్డ వారి నుంచి నాలుగు పందెం కోళ్లను, 17 బైక్‌లను, ఎనిమిది మొబైల్‌ ఫోన్లు, రూ.13 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించినట్లు పేర్కొన్నారు. కోళ్ల పందేలు, పేకాటతో మ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా కుదేలై, అప్పుల బారిన పడుతున్నాయని అన్నారు. పారిపోయిన వారిని గుర్తించి, రిమాండ్‌ చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 15 , 2024 | 11:05 PM

Advertising
Advertising