ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పొలిటికల్‌.. హీట్‌

ABN, Publish Date - Nov 04 , 2024 | 11:29 PM

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పోరు స్తబ్దుగా మారింది. రాష్ట్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నప్పటికీ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ఉండటం లేదు. కానీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రస్తుతం దూకుడు పెంచుతున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత స్తబ్దుగా పార్టీలు

తాజాగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభం

రైతాంగ నిరసన పేరుతో వనపర్తిలో మాజీ మంత్రి హరీశ్‌రావు సభ

పాలమూరులో మాజీ మంత్రి ఆధ్వర్యంలో ధర్నా

అరెస్టులు, వివాదాల నేపథ్యంలో పార్టీల మధ్య రచ్చ

మహబూబ్‌నగర్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పోరు స్తబ్దుగా మారింది. రాష్ట్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నప్పటికీ.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ఉండటం లేదు. కానీ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రస్తుతం దూకుడు పెంచుతున్నారు. కొందరు రాష్ట్రస్థాయి అంశాలను ప్రాతిపదికగా చేసుకుని జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు జిల్లా స్థాయిలోని అంశాల ఆధారంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిస్తున్నారు. ఇటీవల వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతుబంధు, రుణమాఫీ అమలు తీరుపై రైతాంగ నిరసన సభ ఏర్పాటు చేయగా.. మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సభ జరగడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే దానిపై అధికారపక్షం నుంచి కూడా భారీగానే కౌంటర్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో రుణమాఫీ తీరు, అభివృద్ధిపై చర్చ కు సవాళ్లూ వచ్చాయి. అక్రమ అరెస్టులు, పోలీసుల వేధింపులు బీఆర్‌ఎ్‌సపై ఉన్నాయని ఆరోపిస్తూ తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేం ద్రంలో మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కూడా.. చేశారు. రోజుకో ముఖ్య నాయకుడిని తీసుకువచ్చి జనంలోకి చర్చ వెళ్లేలా కార్యాచరణను అమలు చేస్తున్నా రు. కాంగ్రెస్‌ నాయకులు కూడా శ్రీనివా్‌సగౌడ్‌ హయాంలో అక్రమాలు, అన్యాయాలు జరిగాయని పత్రికా సమావేశాల ద్వారా ఖండిస్తూనే ఉన్నారు.

523 సర్వే కేంద్రంగానే..

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో 523 సర్వే నెంబర్‌ వివాదం చాన్నాళ్లుగా ఉంది. అక్రమ పట్టాలు, నకిలీ పట్టాలు పేరు ఏదైనా అక్కడ అవినీతి భారీ ఎత్తున జరిగిందనే చర్చ ఉంది. ప్రభుత్వం మారిన తర్వా త ఇటీవల ఆ సర్వే నెంబర్‌లో ఉన్న కొన్ని ఇళ్లను ఆక్రమణలుగా అధికారులు గుర్తించి, కూల్చి వేశారు. అక్కడివరకు బాగానే ఉన్నా.. అక్కడ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బాసట అనే పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. అధికారులు కూడా అక్కడ నకిలీ పట్టాలకు కారకులు వీరే అని నలుగురిపై కేసు నమోదు చేశారు. ఏ4గా మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ తమ్ముడు శ్రీకాంత్‌గౌడ్‌ పేరును చేర్చారు. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు బెయిల్‌ ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలించలేదు. దాంతో శ్రీనివా్‌సగౌడ్‌ తన తమ్ముడిని గత నెల 25న స్వయంగా పోలీస్‌ స్టేషన్‌ వద్ద వదిలి సరెండర్‌ చేయించారు. ఆ తర్వాత రోజు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తమ వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌ నాయకులేమో తమ ప్రమే యం లేదని, అధికారులు వారి పని చేసుకుంటూ వెళ్తున్నారని చెబుతున్నారు. కేవలం ఆ బాధితులకు అండగా ఉన్నందుకే తన సోదరుడిని జైలుపాలు చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు ములాఖత్‌లకు హాజరవుతున్నారు. 2018లోనే కేసులు నమోదయ్యాయని, ఇప్పడు కావాలనే శ్రీకాంత్‌గౌడ్‌ను ఇరికించారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. ఇదిలా ఉంటే ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులతో బోగస్‌ పట్టాల విషయంలో ఇంకా బాధితులను విచారించడంతోపాటు తమ కస్టడీకి తీసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్న ట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఈ వివాదం కేంద్రంగా పొలిటికల్‌ హీట్‌ను పెంచడానికి కార్యాచరణను అమలు చేస్తోంది.

‘సోషల్‌’ వివాదం..

ప్రస్తుతం పార్టీల మధ్య వ్యక్తిగత ఆరోపణల కంటే సోషల్‌ మీడియాలో ఆ పార్టీ సోషల్‌ కార్యకర్తలు చేసుకునే వంగ్య కౌంటర్లు చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఏ పార్టీ అయినా సరే తమ హయాంలో చేసిన తప్పులను ఒగ్గి.. ఎదుటి పార్టీ చేసిన తప్పులనే ఎత్తి చూపడం సర్వ సాధారణమే. అయితే కొన్నిసార్లు వారి రాష్ట్ర స్థాయి బాస్‌లకు అనుగుణంగా ఉండేందుకు డోస్‌ పెంచాలనే ఉద్దేశంతో సోషల్‌ కార్యకర్తల తీరు కూడా మితిమీరిపోతోంది. ప్రతీ పార్టీకి ఇప్పుడు సోష ల్‌ మీడియా అనేది ప్రత్యేక విభాగంగా పని చేస్తుండగా.. వారి హ్యాండిల్స్‌ ద్వారా పెట్టే పోస్టులపై కేసులు కూడా నమోదవుతున్నా యి. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో కూడా ఈ కేసుల నమోదు, దాడులు చాలా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల ముందు పెట్టిన పోస్టు వల్ల పోలీసులు తనను కొట్టారని శివ అనే ఒక కార్యకర్త చెప్పాడు. ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు తమ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి, దాడి చేస్తున్నారని మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొన్న వారిలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు కూడా కౌంటర్లు ఇచ్చారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్‌ఖాద్రి తదితరులు కౌంటర్లు ఇచ్చారు.

Updated Date - Nov 04 , 2024 | 11:29 PM