ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పల్లెల్లో గాడి తప్పిన పాలన

ABN, Publish Date - Mar 14 , 2024 | 11:33 PM

సర్పంచుల పదవీ కాలం ముగిసింది. రెండు మూడు గ్రామాలకు కలిపి ప్రభుత్వం ఒక ప్రత్యేకాధికారిని నియమించింది.

ఆలూరులో ట్యాంకర్‌ వద్ద నీరు పట్టుకుంటున్న గ్రామస్థులు

- రెండు మూడు గ్రామాలకో ప్రత్యేకాధికారి

- పర్యవేక్షణ లేక సమస్యల తిష్ఠ

- కనిపించని పారిశుధ్య చర్యలు

- అరకొరగా ‘భగీరథ’ నీటి సరఫరా

గట్టు, మార్చి 14 : సర్పంచుల పదవీ కాలం ముగిసింది. రెండు మూడు గ్రామాలకు కలిపి ప్రభుత్వం ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. ఒక్కరే అన్ని గ్రామా లను చూసుకోవాల్సి రావడంతో పర్యవేక్షణ సక్రమంగా సాగడం లేదు. గట్టు మండలంలోని మిట్టదడ్డి, మాచర్ల, ఆలూరు తదితర గ్రామాలను గురువారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. ఆయా గ్రామాల్లో సమస్యలను తెలుసుకు న్నది. గట్టు మండలంలో మొత్తం 27 గ్రామ పంచాయతీ లుండగా, తొమ్మిది మంది ప్రత్యే కాధికారులను నియమించారు. ఒక్కరే రెండు మూడు గ్రామాలను పర్యవేక్షించాల్సి ఉండటం ఇబ్బందిగా మారింది. బాధ్యతలు స్వీకరించిన మొదట్లో వారు ఒకటి రెండు రోజులు ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఆ తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి చూడ టం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామ కార్యదర్శులే అన్ని బాధ్యతలు చూసుకోవాల్సి వస్తోంది. దీంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇళ్ల నుంచి చెత్తను సేకరించి, డంపింగ్‌ యార్డ్‌కు తరలించడం, విద్యు త్‌ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం తదితర మౌలిక పనులు కూడా సక్రమంగా సాగడం లేదు. వేసవి ప్రారంభం కావడంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెల కొన్నది. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అంతంత మాత్రంగా ఉంటోంది. దీంతో కొన్ని గ్రామాల్లో వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా, అవి ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. మురికి కాలువలను శుభ్రం చేయక పోవడంతో దుర్వాసన వెదజల్లు తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. గ్రామాలకు కేటాయించిన ప్రత్యేకాదికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులను గుర్తించి, వారికి దిశానిర్దేశం చేస్తాం. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం.

- చెన్నయ్య, ఎంపీడీవో, మండల ఇన్‌చార్జి

Updated Date - Mar 14 , 2024 | 11:33 PM

Advertising
Advertising