ప్రజావాణి ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:50 PM
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు.
- జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాలన్యూటౌన్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:50 PM