ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి

ABN, Publish Date - Nov 11 , 2024 | 10:55 PM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్‌ పిలుపునిచ్చారు.

సభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్‌

వీపనగండ్ల, నవంబరు 11, (ఆంధ్రజ్యోతి) : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో సీపీఎం మూడో మహాసభల సందర్భ ంగా ప్రతినిధుల సభ నిర్వహించారు. మాజీ ఉ ప సర్పంచ్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఎం.రా ములు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంత రం అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి రాష్ట్ర నాయకులు సాగర్‌ మాట్లాడారు. కేంద్రం లో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ బడా కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతుందని అన్నారు. పేద ప్రజల కడుపు కొట్టేందుకే ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. మతోన్మాదం రాజకీయాలకు పాల్పడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అరికట్ట డంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మ హబూబ్‌నగర్‌ జిల్లాలో పెండింగ్‌లోని ప్రాజెక్టు లను లిఫ్టులను వెంటనే పూర్తి చేసి సాగునీరు అందించాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జా న్‌వెస్లి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర నా యకులు భూపాల్‌, వెంకటరాములు, జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, మేకల ఆంజనే యులు, బాల్‌రెడ్డి, లక్ష్మి, మురళి పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 10:55 PM