ఆలయాల పరిరక్షణ అందరి బాధ్యత
ABN, Publish Date - Oct 20 , 2024 | 10:51 PM
భారతీయ సంస్కృతికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ పాలమూరు విభాగ్ ప్రముఖ్ దేవేందర్‌జీ అన్నారు.
- ఆర్‌ఎస్‌ఎస్ పాలమూరు విభాగ్ ప్రముఖ్ దేవేందర్‌జీ
- పట్టణంలో ఆకట్టుకున్న ర్యాలీ
గద్వాల టౌన్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : భారతీయ సంస్కృతికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత అని రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ పాలమూరు విభాగ్ ప్రముఖ్ దేవేందర్‌జీ అన్నారు. ఇటీవల ఆలయాలపై జరుగుతున్న వరుసదాడులను దేశభక్తులందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఈవెంట్ హాల్‌లో నిర్వహించిన రాష్ర్టీయ స్వయం సేవక్ సంఘ్ పద సంచలన మహోత్సవ సభలో పాల్గొని, మాట్లాడారు. అఖండ్ భారత్ ఐక్యత, హైందవ సంస్కృతి పరిరక్షణ, దేశభక్తి లక్ష్యాలుగా ఏర్పడిన ఆర్‌ఎస్‌ఎస్ వంద ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న పద సంచలన ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో సాగింది. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఏకరూప దస్తులు ధరించి చేతిలో దండలంతో చేసిన కవాతు పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. అనంతరం సభలో మాట్లాడిన దేవేందర్‌జీ, ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు, సాగించిన ప్రయాణం, సాధించిన విజయాలు, చెక్కుచెదరని క్రమశిక్షణ, అంకితభావం, దేశభక్తి తదితర అంశాల గురించి కార్యకర్తలకు ఉద్బోధించారు. కార్యక్రమంలో జోగుళాంబ గద్వాల వనపర్తి సంఘ్‌చాలక్ గోపాల్‌రావు ఏగ్బోటే, కార్యకర్తలు ఉన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 10:51 PM