ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి

ABN, Publish Date - Nov 11 , 2024 | 10:58 PM

ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికా రులను ఆదేశించారు.

ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేట టౌన్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికా రులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లో ఫిర్యాదుదారుల నుంచి ఆమె వినతులు స్వీకరించి, పరిష్కారానికి అధి కారులను ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 10 ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ అడిషనల్‌ కలెక్టర్‌ బెల్‌షాలం, ఆర్డీవో రాంచందర్‌నాయక్‌, ఏవో జయసుధ తదితరులున్నారు.

విద్యార్థుల మేథాశక్తిని పెంపొందించాలి

విద్యార్థుల మేథాశక్తిని పెంపొందించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ వీసీ హాల్‌లో జిల్లాలోని ఎంఈవోలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలతో ఆమె సమా వేశమయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల విజిట్‌ రిపోర్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్ర తీనెల నిర్వహించే సమావేశానికి పూర్తిస్థాయి ని వేదికలతో హాజరుకావాలన్నారు. అనంతరం ఎఫ్‌ఎల్‌ఎన్‌, వర్క్‌బుక్‌, జాలిపోనిక్‌ అమలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. డీఈవో అబ్దుల్‌ఘని, సెక్టోరియల్‌ అధికారులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు అభినందన

మక్తల్‌ : మక్తల్‌ మండలం కర్ని జడ్పీహెచ్‌ ఎస్‌కు చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణి శశిరేఖ, జాతీయ స్థాయి కరాటేలో రజతం సాధించిన రుక్సానాబేగంను కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ సోమవారం తన చాంబర్‌లో సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణి స్తే స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. డీఈవో అబ్దుల్‌గని, జీహెచ్‌ఎం వెంకటయ్యగౌడ్‌, పీడీ రూప, ఏఎంవో విద్యాసాగర్‌, శ్రీనివాసులు, కరాటే మాస్టర్‌ వెంకటేష్‌ ఉన్నారు.

డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని వినతి

మక్తల్‌లో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందిం చారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు పృథ్వీ మాట్లాడారు. డయాలసిస్‌ ఏర్పాటు అవశ్యకతను కలెక్టర్‌కు వివరించారు. నాయకులు శ్రీహరి, తేజవర్దన్‌, రాంచందర్‌, రమేష్‌ ఉన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 10:58 PM