ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:42 PM
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ప్రతి ప్రై వేట్ ఆసుపత్రుల్లో క్వాలిఫైడ్ డాక్టర్ తప్పక ఉం డాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప అన్నారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప
గద్వాలన్యూటౌన్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం ప్రతి ప్రై వేట్ ఆసుపత్రుల్లో క్వాలిఫైడ్ డాక్టర్ తప్పక ఉం డాలని డీఎంహెచ్‌వో డాక్టర్ సిద్దప్ప అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యా లయంలో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ప్రకారం ప్రతీ ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించే క్వాలిఫైడ్ డాక్టర్ తప్పనిసరిగా ప్రైవేట్ హాస్పిటల్‌లో, హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్, మెడికల్ కౌన్సిల్, బయో మెడికల్, పీసీబీ సర్టిఫికెట్స్, ప్రైస్ లిస్ట్, సిటిజన్ చార్జర్‌లను తప్పక డిస్‌ప్లే ఉంచాలన్నారు. అలా గే ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహించే డాక్టర్లు తప్పనిసరిగా ఓపీ రిజిస్టర్, ఐపీ, కేసీట్, రెఫరల్, విజిట ర్స్ రిజిస్టర్లు తప్పకఉండేలా చూడాలన్నారు. పీసీపీఎన్‌డీటీ యాక్ట్ ప్రకారం ప్రతీ స్కానింగ్ సెంటర్ నిర్వహించే క్వాలిఫైడ్ రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ తప్పనిసరిగా ప్రతినెలా ఫార్మ్- ఎఫ్ ఎస్ జిల్లావైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోకి పంపించాలన్నారు. గర్భిణులకు స్కానింగ్ రిజిస్టర్, జనరల్ స్కానింగ్ రిజిస్టర్ విడివిడిగా నిర్వహించాలన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గైడెన్స్ తప్పనిరిసరిగా ప్రతి ప్రవేట్ ఆసుపత్రిలో నిర్వహించే నిర్వాహకులు పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసూనరాణి, సిబ్బంది మధుసూదన్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, రామాంజనేయులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఉన్నారు.
Updated Date - Dec 06 , 2024 | 11:42 PM