భక్తిశ్రద్ధలతో బొడ్రాళ్ల ఊరేగింపు
ABN, Publish Date - Nov 08 , 2024 | 10:59 PM
నాభిశిల సీతలదేవి(బొడ్రాయి) విగ్రహ ప్రతిష్ఠాపన కా ర్యక్రమం పురస్కరించుకొని మండల కేంద్రం లో శుక్రవారం ఉదయం బొడ్రాళ్లు ప్రత్యేక వా హనంలో బ్యాండ్ భజంత్రీలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.
కృష్ణ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): నాభిశిల సీతలదేవి(బొడ్రాయి) విగ్రహ ప్రతిష్ఠాపన కా ర్యక్రమం పురస్కరించుకొని మండల కేంద్రం లో శుక్రవారం ఉదయం బొడ్రాళ్లు ప్రత్యేక వా హనంలో బ్యాండ్ భజంత్రీలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. పవిత్ర కృష్ణానది వద్ద తీసుకెళ్లి గంగా నారాయణభట్, సచిన్‌భ ట్ పూజలు నిర్వహించారు. మహిళలు జల్ది బిందెలతో గ్రామ పుర వీధుల్లో ఊరేగింపు జరి పారు. అనంతరం క్షిరలింగేశ్వరస్వామి ప్రాంగ ణంలో ఆంజనేయ దేవాలయ ప్రాంగణంలో బొడ్రాళ్లు జలదివాస్‌లో పెట్టారు. అనంతరం అన్నదానం నిర్వహించినట్లు నాభిశిల విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ సభ్యులు గ్రామస్థులు అ న్నారు. మంజునాథ్, జగన్నాథ్ నాయక్, శంక ర్‌నాయక్, సంగప్ప, లక్ష్మిసింగ్‌ఠాకూర్, నాగేం ద్ర, ప్రజాప్రతినిధులు అంజన్నమ్మ, సురేష్, శంకరప్ప, జవహర్‌లాల్, కిష్టప్ప, తాయప్ప గౌడ్, సిద్దరం, మహేష్, నాగేష్‌కోరి, నాగరాజ్ గౌడ్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 08 , 2024 | 10:59 PM