ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యమైన భోజనం అందించాలి

ABN, Publish Date - Nov 23 , 2024 | 10:56 PM

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు.

మైనార్టీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలో విద్యార్థులకు వడ్డించిన టిఫిన్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- వసతిగృహాల తనిఖీ

నారాయణపేట టౌన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అధికారులను ఆదేశించారు. శనివారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీ, బీసీ బాలుర వసతిగృహం, బాలికల వసతిగృహలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్‌లోని వస్తు నిల్వ వివరాలు, ఫుడ్‌ క్వాలిటీ, విద్యార్థుల హాజరు శాతాన్ని, వసతిగృహ పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ టిఫిన్‌ చేశారు. అలాగే బియ్యాన్ని పరిశీలించి, వంటలను చేయించారు. మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రశీద్‌, తహసీల్దార్‌ అమరేంద్రకృష్ణ, ప్రిన్సిపాల్‌ జగదీశ్వర్‌ తదితరులున్నారు.

సర్వేను వేగవంతం చేయాలి..

నారాయణపేట టౌన్‌/రూరల్‌ : కుటుంబ సర్వే నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పరిషత్‌ కార్యాలయంలో కొనసాగుతున్న డేటా ఎంట్రీని కలెక్టర్‌ పరిశీలించి, ఎన్యుమ రేటర్లకు పలు సూచనలు చేశారు. డేటా ఎంట్రీకి అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్‌ ట్యాప్‌లను సమకూర్చుకోవాలన్నారు. గ్రామాల వారీగా పూర్తయిన సర్వే ఫారాలను ఎక్కడ భద్రపర్చారని ఆరా తీశారు. స్థానిక చిట్టెం నర్సిరెడ్డి డిగ్రీ కాలేజీలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి డేటా ఎంట్రీని ఈ నెలాఖరు వరకు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ వెంట మునిసిపల్‌ కమిషనర్‌ సునీత, ఎంపీడీవో సుదర్శన్‌ తదితరులున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 10:56 PM