ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నాణ్యమైన భోజనం అందించాలి

ABN, Publish Date - Nov 23 , 2024 | 11:07 PM

విద్యార్థులకు నాణ్యమైన బోజనం అందించాలని ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.

ఆర్డీవో శ్రీనివాసరావు

అలంపూర్‌ చౌరస్తా, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు నాణ్యమైన బోజనం అందించాలని ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. ఉండవల్లి మండల పరిధిలోని సంక్షేమ హాస్టల్స్‌ను, గురుకులాలను శనివారం సందర్శించారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను పరిశీలించి, అక్కడ నీటి సమస్య ఉందని విద్యార్థులు తెలపడంతో వెంటనే మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అలంపూర్‌ చౌరస్తాలోని బాలుర గురుకుల, పుల్లూరు బాలికల గురుకుల, కలుగొట్ల కేజీబీవీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తహసీల్దారు హరికృష్ణ, సీనియర్‌ ఆసిస్టెంట్‌ లక్ష్మిరెడ్డి, ఆర్‌ఐ శ్రీవాణి ఉన్నారు.

పాఠశాలను తనిఖీ చేసిన జడ్పీ సీఈవో

మల్దకల్‌ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర వసతి గృహంతో పాటు ప్రాథమిక పాఠశాలలను జడ్పీ సీఈవో కాంతమ్మ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, వంట వస్తువులు, వంట గదిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు. మండల అభివృద్ధి అధికారి ఆంజనేయరెడ్డి, ఎంపీఈవో రాజశేఖర్‌, ఎంఈవో సురేశ్‌, వసతి గృహ వార్డెన్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

శుభ్రత పాటించాలి

ఎర్రవల్లి : విద్యార్థినులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్యామ్‌ సుందర్‌ అన్నారు. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాల, కస్తూర్బా పాఠశాలను శనివారం ఎంపీడీవో అజర్‌ మొహీయద్దీన్‌తో కలిసి వంట గదితో పాటు సరుకులను పరిశీలించారు. కస్తూర్బా ప్రత్యేకాధికారి ఆసియాబేగం ఉన్నారు.

మెనూ తప్పక పాటించాలి

రాజోలి : హాస్టల్లో ఉండే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని మండల ప్రత్యేకాధికారి, డీసీవో శ్రీనివాసులు అన్నారు. రాజోలి బాలుర వసతి గృహం, కొత్త రాజోలిలోని కేజీబీవీ పాఠశాలను ఆయన పరిశీలించి, విద్యార్థులతో భోజనం, అక్కడున్న వసతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీబీవీ పాఠశాలను పరిశీలించి, అల్పాహారం పరిశీలించారు. కేజీబీవీ కొత్త భవనం పూర్తి చేసి వచ్చే ఏడాది అందుబాటులోకి తేవాలని ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక అధికారి చంద్రకళ, ఎంపీడీవో ఖాజామొయినుద్దిన్‌, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య పాల్గొన్నారు.

మెనూ లేకుంటే చర్యలు

మానవపాడు : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించకుంటే చర్యలు తప్పవని మండల స్పెషల్‌ ఆఫీసర్‌ సక్రియా నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసి, భోజనంపై ఆరా తీశారు. పాఠశాలలో ఇంటర్‌ వరకు కొనసాగడం, తరగతి గదులు తక్కువగా ఉండటంతో ఇబ్బందిగా మారిందని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:07 PM