ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:09 PM

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్‌ మార్కెట్‌కు పోయి తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు.

లత్తిపురంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచంద్రారెడ్డి

-కేంద్రాలను పరిశీలించిన బీజేపీ నాయకులు

గద్వాల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్‌ మార్కెట్‌కు పోయి తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు. బుధవారం మండలంఓని బీరోలు, లత్తిపురం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికే దాదాపు ఐదు వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారని ఆరోపించారు. ప్రభత్వం బయటకు మాత్రం కొంటున్నామని చెబుతున్నా.. కేంద్రాల్లో ఆ పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం తుఫాన్‌ వచ్చే పరిస్థితి ఉందని, ధాన్యం తడవకుండా టార్ఫాలిన్‌ను ఇవ్వాలన్నారు. కేంద్రం సబ్సిడీతో ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన బోనస్‌ హామీ నిలబెట్టుకోవాలని, సన్నాలకే కాకుండా అన్ని వరి ధాన్యాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రాల్లోకి ధాన్యం వస్తే అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలన్నారు. ఇప్పటికే ఒక పంటకు రైతుబంధు ఇవ్వకపోవడంతో పెట్టుబడులకు రైతులు ఆప్పులు తెచ్చుకున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, నాయకులు ఢిల్లీవాల కృష్ణ, ఓంకార్‌, మధుసూదన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, శ్రీనివాసులు, పాండు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:09 PM