సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:36 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ప్రతీనెల ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది.
- పట్టుబడినా తీరు మార్చుకోని అక్రమార్కులు
- బియ్యం సేకరణకు గ్రామాల్లో ప్రత్యేక బృందాలు
- రీసైక్లింగ్ చేసి ప్రత్యేక బ్రాండ్ పేరుతో వ్యాపారం
- క్వింటాలు వెయ్యి రూపాయలకు కొని రూ. 4,500 విక్రయం
అయిజటౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ప్రతీనెల ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ రేషన్ కార్డును పొందిన కొందరు స్వార్థపరుల కారణం గా రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జరుగుతుందనే విమర్షలు వస్తున్నాయి. ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి కిలో పది రూపాయలు చొప్పు న విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి న అక్రమార్కులు గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా రేషన్ బియ్యం సేకరించేందుకు ప్ర త్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. ఈ బియ్యాన్ని నడిగడ్డలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న అయిజ, గట్టు, ధరూరు, కేటీదొడ్డి మండలాల మీదుగా కర్ణాటకలోని రాయచూరుకు తరలిస్తున్నారనే విమర్షలు ఉన్నాయి. అక్కడ వారికి అనుకూలంగా ఉన్న మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్నరకం బియ్యంగా మార్చి వాటినే వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో సుమారు రూ. 4 వేల నుంచి రూ. 4500 వరకు విక్రయిస్తు న్నట్లు తెలుస్తోంది.
వివిధ ప్రాంతాలకు తరలిస్తూ పట్టుబడిన రేషన్ బియ్యం
2022 జనవరిలో సుమారు 271 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అదేవిధంగా 2024 ఫిబ్రవరిలో 37 క్వింటాళ్లు, మార్చి, ఏప్రిల్ నెలల్లో 144.5 క్వింటాళ్లు, మే నెలలో 89 క్వింటాళ్లు, నవంబరులో 86.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేశారు.
పటిష్ట నిఘా ఉంచాం
అక్రమార్కులు గ్రామాలలో రేషన్ బియ్యా న్ని తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యవహరంపై పటిష్ట నిఘా ఉంచాం. ఎస్పీ ఆదేశాలతో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి తనఖీలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ సంవత్సరం 20కి పైగానే కేసులు కూడా నమోదు చేశాం. ప్రజలు ఇటు వంటి సంఘటనలపై మాకు సమాచారం ఇవ్వాలి.
- టాటాబాబు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శాంతినగర్, గద్వాల
Updated Date - Nov 19 , 2024 | 11:36 PM