గణేష్ ఉత్సవాలకు రెడీ
ABN, Publish Date - Sep 06 , 2024 | 11:18 PM
వినాయక చవితి వేడుకల కోసం గణనాథులను భక్తులు మండపాలకు తరలిస్తున్నారు.
- మండపాలకు చేరుతున్న విగ్రహాలు
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, సెప్టెంబరు 6 : వినాయక చవితి వేడుకల కోసం గణనాథులను భక్తులు మండపాలకు తరలిస్తున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భక్తులు రూ.వేలు వెచ్చించి ఆకర్షణీయమైన వినాయకులను కొనుగోలు చేసి మండపాలకు తరలిస్తున్నారు. భాజభజంత్రీలు, డీజే పాటలతో యువకులు ఉత్సాహంగా గణనాథులను తమ కాలనీలు, గ్రామాలకు తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే గణనాథులు కొలువుదీరేందుకు భక్తులు మండపాలను ప్రత్యేక అలంకరణలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. రూ.వేల నుంచి లక్షల వరకు మండపాల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు. డెకరేషన్ ఏర్పాటు, డీజే లైట్లు, తదితర హంగుల కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కొన్ని చోట్ల భక్త బృందాలే చందాలు వేసుకుని మండపాలను ఏర్పాటు చేయగా మరికొన్ని చోట్ల దాతలు మండపాల ఏర్పాటు కు ముందుకు వస్తున్నారు.
మట్టి గణపతులను పంపిణీ చేసిన కలెక్టర్
కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం జిల్లా అధికారులకు, ఉద్యోగులకు మట్టి గణపతులను అందజేశారు. మట్టి గణపతులతో పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 06 , 2024 | 11:18 PM