ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బండ్ల కుటుంబంపై తిరుగుబాటు యాత్ర

ABN, Publish Date - Nov 05 , 2024 | 11:10 PM

బండ్ల కుటుంబం నడిగడ్డ ప్రజల రక్తాన్ని తాగుతున్నారని, త్వరలోనే తిరుగుబాటు యాత్ర ప్రారంభిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకుడు కుర్వ విజయ్‌కుమార్‌ అన్నారు.

లండన్‌కు వెళ్లిన ఎమ్మెల్యేల ఫొటోలను చూపిస్తూ మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు కుర్వ విజయ్‌కుమార్‌

- ప్రజలు కష్టాల్లో ఉంటే ఎమ్మెల్యే విదేశాల్లో జల్సాలా

- ఎమ్మెల్యే ఏ పార్టీ అనే విషయంలో స్పష్టత ఇవ్వాలి

- బీఆర్‌ఎస్‌ నాయకుడు కుర్వ విజయ్‌కుమార్‌

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి) : బండ్ల కుటుంబం నడిగడ్డ ప్రజల రక్తాన్ని తాగుతున్నారని, త్వరలోనే తిరుగుబాటు యాత్ర ప్రారంభిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకుడు కుర్వ విజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు సమస్యలతో ఉంటే ఎమ్మెల్యే మాత్రం ప్రభుత్వ సొమ్ముతో విదేశీ జల్సాలు చేసేందుకు లండన్‌కు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి జూపల్లి తనవెంట ఐదు మంది ఎమ్మెల్యే ఉన్నారంటూ చెప్పకోవడానికే తీసుకెళ్లడం విచారకరమన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో జరిగే అంతర్జాతీయ టూరిజం ఎక్ప్స్‌లో తెలంగాణ టూరిజం శాఖ తరుపున స్టాల్‌ ఏర్పాటు చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఎమ్మెల్యేకు ఏమి పని ఉందంటూ దుయ్యబట్టారు. బిజ్వారం గ్రామానికి చెందిన బాలిక మృతికి కారణమైన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సోదరుడు బండ్ల రాజశేఖర్‌రెడ్డిని కాపాడటం కోసం పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అరెస్టు చేయకుండా చేస్తున్న ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు నమోదు చేయాలన్నారు. అసలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీనా, కాంగ్రెస్‌ పార్టీనా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. వారంలోగా బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ అధిస్టానానికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్‌ కుర్వ పల్లయ్య, నాయకులు మంద మల్లికార్జున్‌, ప్రతాప్‌రెడ్డి, బీచుపల్లి, మత్తాలి, రవి, రాము ఉన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:10 PM