ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొల్లాపూర్‌ నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ బస్సు

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:07 PM

శ్రీశైలం మల్లికార్జునస్వా మి దర్శనం కోసం కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొల్లాపూర్‌ టూ శ్రీశైలం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది.

కొల్లాపూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో జెండా ఊపి బస్సు ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, సెప్టెంబరు 15 : శ్రీశైలం మల్లికార్జునస్వా మి దర్శనం కోసం కొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం కొల్లాపూర్‌ టూ శ్రీశైలం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. కొల్లాపూర్‌ ఆర్టీసీ డి పోకు మంజూరైన రెండు ఎక్స్‌ప్రెస్‌లలో ఒకటి కొల్లాపూ ర్‌ నుంచి శ్రీశైలం, మరొకటి కొల్లాపూర్‌ టు కర్నూల్‌ వయా వీపనగండ్ల మీదుగా వెళ్లే బస్సులను జెండా ఊపి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రయాణికులకు అం దుబాటులోకి తెచ్చారు. కొల్లాపూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ నుం చి ఉదయం 9గంటలకు వయా నాగర్‌కర్నూల్‌ అచ్చంపే ట మీదుగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బస్సు వెళ్తుందన్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు వెళ్లి, 2:30గంటలకు అ చ్చంపేట వయా నాగర్‌కర్నూల్‌ కొల్లాపూర్‌ మీదుగా బ యల్దేరి రాత్రి 8గంటలకు కొల్లాపూర్‌కు చేరుతుందన్నా రు. అదేవిధంగా కొల్లాపూర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి ఉద యం 7గంటలకు కొల్లాపూర్‌ వయా వీపనగండ్ల గోపాల దిన్నె, పెబ్బేరు మీదుగా కర్నూల్‌కు బస్సు బయల్దేరు తుందన్నారు. సాయంత్రం 4:15గంటలకు తిరిగి కర్నూల్‌ నుంచి బయల్దేరి పెబ్బేరు వయా గోవర్ధనగిరి గోపాల దిన్నె గ్రామం, వీపనగండ్ల, తూంకుం ట మీదుగా కొల్లాపూర్‌ చేరుతుందని డిపో మేనేజర్‌ ఉమాశంకర్‌గౌడ్‌ పేర్కొ న్నారు. ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వి నియోగపర్చుకోవాలని మంత్రి కోరారు. భవిష్యత్తు రోజుల్లో డిపో అభివృద్ధికై మరిన్ని బస్సులు మంజూరు చేయించి ప్రయాణీకులకు అం దుబాటులోకి తె స్తానని మంత్రి పర్కొ న్నారు. మునిసి పల్‌ కౌన్సిలర్లు మాచుపల్లి బాలస్వామి, కాంగ్రెస్‌ నాయకులు మేకల నా గరాజు, కమలాకర్‌రావు, కృష్ణమనా యుడు, బాలరాజు, ఖాదీర్‌, ఆర్టీసీ సిబ్బంది రామ య్య తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి సప్తనదుల నీరు అందజేత

పెద్దకొత్తపల్లి: మహాగణపతి నిమజ్జనం తర్వాత మి గిలిన మట్టి కలశాల చంబుతో సప్తనదుల జలాలను రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జ్ఞానవికాస భారతి సేవా సంస్థ కొల్లాపూర్‌ నియోజక వర్గ అధ్యక్షుడు మారోజు నరేంద్రచారి అందజేసినట్లు ఆదివారం తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని జ్ఞా న వికాస భారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన మట్టిగణపతిని సప్తనదుల్లోని జలాలను తీసుకొచ్చి మహాగణపతిని నిమజ్జనం చేసిన తర్వాత మిగిలిన మ ట్టిని కలశంతో మంత్రికి కొల్లాపూర్‌ పట్టణ కార్యాలయం లో జ్ఞాన వికాస భారతి సేవా సంస్థ నియోజకవర్గ అధ్య క్షుడు మారోజు నరేంద్రచారి ఆధ్వర్యంలో ప్రతినిధులు అందజేశారు. ఆ మట్టిని కార్యాలయం ఆవరణలో ఉన్న మొక్కలకు మంత్రితో కలిసి వారు నీరు పోశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి కలుషితం కాకుండా మట్టి గణపతులను తయారు చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి కార్యక్రమాలను ఇంకా ప్రచారం చేయాలని ఆయన కోరారు. జ్ఞాన వికాస భారతి సేవా సంస్థ జిల్లా కన్వీనర్‌ గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గన్నోజు సుధారాణి, కార్యదర్శి జయప్రకాశ్‌ నారాయణచారి, వెంకటేశ్‌యా దవ్‌, రమేష్‌గౌడ్‌, సుల్తాన్‌, చిన్న వీరయ్య, ఆంజనేయు లు, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:07 PM

Advertising
Advertising