పఠనాసక్తితో ఆలోచనలకు పదును
ABN, Publish Date - Nov 20 , 2024 | 10:56 PM
పుస్తక పఠనంతో మెరుగైన ఆలోచనలు తటస్తియాని తద్వారా ప్రతీ అంశంలోను విజ్ఞతతో కూడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.
- అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
- ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
గద్వాల టౌన్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : పుస్తక పఠనంతో మెరుగైన ఆలోచనలు తటస్తియాని తద్వారా ప్రతీ అంశంలోను విజ్ఞతతో కూడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. విద్యార్థులు పుస్తక పఠనను ఎట్టి పరిస్థితులలోను విస్మరించవద్దని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విద్యాభివృద్ధిలో వినియోగించాలని సూచించారు. వారం రోజుల పాటు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 57వ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారం ముగిసాయి. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్, డీపీవో శ్యాంసుందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులుతో కలిసి సరస్వతీ దేవి, భరతమాత చిత్రపటాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన అదనపు కలెక్టర్ జిల్లా కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణం అన్ని వసతులతో త్వరతగతినా పూర్తయ్యేలా కృషి చేస్తానని, పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వపరంగా తగిన తోడ్పాటును అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా విజ్ఞానం లేని విద్య వ్యర్థమన్నా అదనపు కలెక్టర్ బాల్యంలో తాను చదివిన భాస్కర శతకంలోని పద్యాన్ని విద్యార్థులకు చదివి వినిపించారు. గ్రంథాలయాలకు స్థానిక సంస్థల ద్వారా అందాల్సిన సెస్ నిధులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రంథాలయ అఽభివృద్ధికి ప్రభుత్వ పరంగా అందే తోడ్పాటుతో పాటు దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి శ్యాంసుందర్, గ్రంథాలయ అధికారి రామాంజనేయులు, సిబ్బంది ఉన్నారు. వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయం తరపున నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, ముగ్గుల పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
Updated Date - Nov 20 , 2024 | 10:56 PM