ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వసతి గృహాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ABN, Publish Date - Jul 26 , 2024 | 10:59 PM

వసతి గృహాల విద్యార్థుల ఆరో గ్యం, ఆహారం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సూచించారు. శుక్రవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని వెనకబడిన తరగతు ల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అదనపు కలెక్టర్‌ సీతారామారావుతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

కల్వకుర్తి, జూలై 26 : వసతి గృహాల విద్యార్థుల ఆరో గ్యం, ఆహారం, చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సూచించారు. శుక్రవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని వెనకబడిన తరగతు ల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అదనపు కలెక్టర్‌ సీతారామారావుతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో కలిసి హాస్టల్‌ తరగతి గదులను పరిసరాలను, వంట గదిని కలెక్టర్‌ పరిశీలించి, వార్డెన్‌ సిబ్బంది వివరాలను విద్యార్థులతో అ డిగి తెలుసుకున్నారు. వార్డెన్‌ రాత్రి సమయంలో హాస్ట ల్లో బస చేస్తాడా లేదా అని విద్యార్థులను అడిగి తెలు సుకున్నారు. సంబంధించిన హాజరు రిజిస్టర్లను పరిశీలిం చారు. కిచెన్‌, డైనింగ్‌ హాల్‌, స్టోర్‌ రూమ్‌లో ఉన్న సరకు లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విద్యార్థు లతో కలిసి రాత్రి భోజనం చేశా రు. వసతి గృహంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లాడుతూ కల్వకుర్తి బాలుర వసతి గృహాన్ని సందర్శించినట్లు, విద్యార్థులతో కలిసి భోజనం చే శామని భోజనం నాణ్యత ప్రమా ణాలు పాటిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారని కలెక్టర్‌ చెప్పారు. వి ద్యార్థులు తన దృష్టికి తెచ్చిన మరుగుదొడ్లు, కాంపౌండ్‌ వాల్‌ తదితర అంశాలను ఈఈపీఆర్‌ ద్వారా పనులను పూర్తి చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. జిల్లాలోని అ న్ని వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యల ను పరిష్కరించేందు మొదటి ప్రాధాన్యతన ఇస్తానన్నా రు. విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. కలెక్టర్‌ వెంట కల్వకుర్తి తహసీల్దార్‌ ఇబ్రహీం, తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 10:59 PM

Advertising
Advertising
<