క్రీడాభివృద్ధికి పెద్దపీట : డీవైఎస్‌వో
ABN, Publish Date - Nov 06 , 2024 | 11:09 PM
క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డీవైఎస్‌వో డాక్టర్ బీఎస్ ఆనంద్ అన్నారు.
గద్వాల అర్బన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డీవైఎస్‌వో డాక్టర్ బీఎస్ ఆనంద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం, సోమనాద్రి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎస్‌జీఎఫ్ 68వ ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి జితేందర్‌తో కలిసి హాజరయ్యారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సోమనాద్రి గ్రౌండ్‌లో హాకీ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు, కౌన్సిలర్ త్యాగరాజు మాట్లాడుతూ ప్రతీ క్రీడాకారుడు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. జిల్లా పీఈటీల అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ అండర్-17 క్రికెట్ పోటీలకు, ఉ మ్మడి జిల్లా స్థాయి హాకీ పోటీలకు క్రీడాకారులు 200 మంది హాజరయ్యారన్నారు. వీరిలో 24 మంది బాలురు, 18 మంది బాలికలను క్రికెట్, హాకీ విభాగాలకు ఎంపిక చేశామన్నారు. క్యాం పులు నిర్వహించి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఈటీలు బీసన్న, ఆనంద్‌కుమార్, రఘు, ఉమ్మడి జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారు.
Updated Date - Nov 06 , 2024 | 11:09 PM