పాలమూరులో క్రీడా పండుగ
ABN, Publish Date - Nov 07 , 2024 | 11:29 PM
Sports festival in Palamuru జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి క్రీడా పండుగకు వేధిక కానుంది. శుక్రవారం నుంచి మహబూబ్‌నగర్ స్టేడియం మైదానం, ఇండోర్ స్టేడియంలో పదో తేదీ వరకు జిల్లా స్కూల్ గే మ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర్ట్రస్థాయి ఎస్‌జీ ఎఫ్ అండర్-19 బాల, బాలికల బాస్కెట్‌బాల్ టోర్నీ జరగనున్నది.
- నేటి నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీ
- పాల్గొననున్న 240 మంది క్రీడాకారులు
- ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, నవంబర్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి క్రీడా పండుగకు వేధిక కానుంది. శుక్రవారం నుంచి మహబూబ్‌నగర్ స్టేడియం మైదానం, ఇండోర్ స్టేడియంలో పదో తేదీ వరకు జిల్లా స్కూల్ గే మ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర్ట్రస్థాయి ఎస్‌జీ ఎఫ్ అండర్-19 బాల, బాలికల బాస్కెట్‌బాల్ టోర్నీ జరగనున్నది. ఎస్‌జీఎఫ్ అండర్-19 సెక్ర టరీ పాపిరెడ్డి ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహణకు ఏ ర్పాట్లు చేశారు. బాలికలకు స్టేడియం, బాలురకు చైతన్య స్కూల్‌లో బస కల్పిస్తున్నారు. స్టేడి యంలో భోజన వసతి కల్పిస్తున్నారు.
పాల్గొననున్న పది జిల్లాల జట్లు
బాల, బాలికల బాస్కెట్‌బాల్ పోటీలకు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, హైద రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి 240 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. టో ర్నీని సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, పలువురు హాజరై ప్రారంభించనున్నారు.
పాలమూరు జట్టు వివరాలు
బాలుర జట్టులో అదిత్, భానుప్రకాష్, సాయి కృష్ణ, యశ్వంత్, సనద్, కేతవత్, అనిల్, ఎన్.అ ర్జున్, గణేష్, హిరాత్, శ్రీను, జి.పవన్, రామ్‌చ రణ్ ఉన్నారు. బాలికల జట్టులో హర్షిత, వైష్ణవి, చైత్ర, హరిణి, శ్రీజ, దీపిక, సిగ్ద, అనన్య, వేద వ్రిద్ద, శ్రేయ ఉన్నారు.
Updated Date - Nov 07 , 2024 | 11:29 PM