‘పది’ ప్రత్యేక తరగతులు ప్రారంభం
ABN, Publish Date - Nov 04 , 2024 | 11:28 PM
పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏటా నిర్వహిస్తోంది. అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, విద్యార్థులకు ప్రత్యేక తరగతులను ఏటా నిర్వహిస్తోంది. అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమయ్యాయి. సబ్జెక్టు వారీగా ఉదయం, సాయంత్రం గంట పాటు అంటే స్కూల్ సమయానికి గంట ముందు, సాయంత్రం స్కూల్ ముగిశాక గంట పాటు తరగతులు నిర్వహించనున్నారు. మొదటి విడతగా ఇప్పుడైతే సాయంత్రం మాత్రమే తరగతులు ప్రారంభించారు. ఉదయం తరగతులపై నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. ఈ డిసెంబరు చివరి నాటికి సిలబస్ పూర్తి చేసి, జనవరి మొదటి వారం నుంచి లేదా సంక్రాంతి సెలవుల తర్వాత రివిజన్ తరగతులు నిర్వహించనున్నారు.
Updated Date - Nov 04 , 2024 | 11:28 PM