ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రారంభించారు.. వదిలేశారు

ABN, Publish Date - Nov 20 , 2024 | 10:57 PM

అధికారులు పట్టించుకోరు.. పాలకుల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ భవనాలు ప్రారంభాలకే పరిమితమవుతున్నాయి.

ప్రారంభం నాటి నుంచి మాచర్లలో వృథాగా ఉన్న పల్లె దవాఖాన

- పేరుకే పల్లె దవాఖానాలు

- రోగులకు అందని సేవలు

గట్టు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : అధికారులు పట్టించుకోరు.. పాలకుల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ భవనాలు ప్రారంభాలకే పరిమితమవుతున్నాయి. లక్షలు రూపాయలు వెచ్చించి.. నిర్మించి హంగు ఆర్భాటాలతో ప్రారంభిస్తారు. అనంతరం వాటి వినియోగం గాలికి వదలి వేయడం పరిపాటిగా మారింది. ఈ కోవకు చెందినదే మాచర్లలోని పల్లె దవాఖాన భవనం. గత ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య మందిర్‌ కింద పల్లె దవాఖానాలు నిర్మించింది. వీటి ద్వార ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని భావించారు. కానీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. మాచర్లలో ఎన్నికల ముందు భవనం అసంపూర్తిగా ఉన్నప్పటికీ హడావుడిగా ప్రారంభించారు. అంతే ఆ రోజు నుంచి నేటి వరకు ఈ కేంద్రం తెరచిన దాఖలాలు లేవు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద నిర్మించిన ఈ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడటంతో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. మాచర్లలోని ఈ భవనాన్ని వైద్య ఆరోగ్య శాఖకు కాంట్రాక్టర్‌ అప్పగించక పోవడం గమనార్హం.

పర్యవేక్షణ లేక అస్తవ్యస్తం

మండలంలోని ఆరగిద్ద, మిట్టదొడ్డి, మాచర్ల, బోయలగూడెం, ఆలూరు, పెంచికలపాడు, గట్టు గ్రామాలకు ఆయుష్మాన్‌ మందిర్‌ కింద పల్లె దవాఖానాలు ఎంపిక చేశారు. కాగా గట్టుతో పాటు పెంచికలపాడులో భవనాలు నిర్మించలేదు. కేటీదొడ్డి మండలంలో కుచినెర్ల, నందిన్నె, చింతలకుంట ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లకు ఎంఎల్‌హెచ్‌పీలను నియమించారు. కానీ పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. పేరుకు మాత్రమే ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లు ఉన్నా.. ఎప్పుడు తెరుచుకుంటాయో ఎప్పుడు వైద్యులు వస్తారో తెలియడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాటిపై చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 20 , 2024 | 10:57 PM