ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ సస్పెన్షన్
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:29 PM
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్‌ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వు లు జారీ చేశారు.
- ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్
వనపర్తి క్రైం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్‌ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వు లు జారీ చేశారు. కొన్ని నెలలుగా ప్రభు వినయ్ ఎక్సై జ్ కార్యాలయానికి రాకుండా ఇంటి దగ్గర నుంచే విధులు నిర్వహిస్తున్నారని బీసీ పొలిటికట్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదుపై కొన్ని రోజులుగా విచారణ చేప ట్టిన అధి కారులు బుధవారం ప్రభు వినయ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభు వినయ్ జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నాటి నుంచి ఉన్నతాధికారులు, ప్రజాప్రతిని దుల అండతో ఆడిందే ఆటగా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఇటీవల వచ్చిన ఆరోపణలతో తన కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని టార్గెట్ చేసి ఆర్డర్‌పై వచ్చిన ఉద్యోగులను తమ స్థానాలకు బదిలీ చేశాడు. సూపరిం టెండెంట్ కార్యాలయంలో పని చేస్తున్న ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు జూనియర్ అసిస్టెంట్ కూడా అవినీతికి పాల్పడుతూ కార్యాల యానికి వచ్చే వారిని వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తు న్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Oct 30 , 2024 | 11:29 PM