ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మునిసిపల్‌ మేనేజర్‌పై చర్యలు తీసుకోండి

ABN, Publish Date - Nov 10 , 2024 | 11:04 PM

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఉపాధ్యాయులపై తప్పుడు ఆరోపణలు చేసి, దురుసుగా ప్రవర్తించిన అయిజ మునిసిపల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న అశోక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం అదనపు కలెక్టర్‌ నర్సింగరావుకు ఉపాధ్యాయులు కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వినతిపత్రం అందజేశారు.

అదనపు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తున్న పిఆర్‌టియు నాయకులు

అదనపు కలెక్టర్‌కు విన్నవించిన ఉపాధ్యాయులు

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఉపాధ్యాయులపై తప్పుడు ఆరోపణలు చేసి, దురుసుగా ప్రవర్తించిన అయిజ మునిసిపల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న అశోక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం అదనపు కలెక్టర్‌ నర్సింగరావుకు ఉపాధ్యాయులు కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాఽధ్యాయులు మాట్లాడుతూ.. ఎం.శ్రీదేవి అనే ఉపాధ్యాయురాలుకు 300 కుటుంబాలకు పైగా ఉన్న బ్లాక్‌కు ఎన్యుమరేటర్‌గా విధులు కేటాయించడం జరిగిందన్నారు. ఆ బ్లాక్‌లో ఎక్కువ శాతం కిరాయి కుటుంబాలు, వలస వెళ్లే బుడగ జంగాల కుటుంబాలు ఉన్నాయి. మొదటి మూడు రోజులు కుటుంబాలను గుర్తించే క్రమంలో 175 కుటుంబాలను గుర్తించగా మిగితా కుటుంబాల ఇండ్లకు తాళాలు వేయడంతో వారి వివరాలు పక్కవాళ్లు కూడా చెప్పకపోవడంతో గుర్తించలేకపోయారు. ఈ విషయంలో ఈ అధికారికి 300 కుటుంబాలు గుర్తించడానికి ఇబ్బంది అవుతుందని, మరొక అనుభవం ఉన్న ఎన్యుమరేటర్‌ను అదనంగా కేటాయించాలని కోరగా మేనేజర్‌ అశోక్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించి నేను అధికారిని అని, నేను చెప్పినట్లు నోరు మూసుకొని చేయమని చెప్పి, ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేస్తున్నాడని, అంతేకాకుండా పై అధికారులకు ఉపాధ్యాయులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పచ్చర్ల తిమ్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, జిల్లా గౌరవ అధ్యక్షుడు నరసింహ్మారెడ్డి అదనపు కలెక్టర్‌ను కోరారు.

Updated Date - Nov 10 , 2024 | 11:04 PM