కోర్టుకు హాజరైన తెలంగాణ ఉద్యమకారులు
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:26 PM
తెలంగాణ ఉద్యమ కాలంలో నమోదైన కేసుకు సంబంధించి సమన్లు అందుకున్న 28మంది ఉద్యమకారులు మంగళవారం జిల్లా కేంద్రం లోని కోర్టులో హాజరయ్యారు.
పాలమూరు, నవంబరు19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ కాలంలో నమోదైన కేసుకు సంబంధించి సమన్లు అందుకున్న 28మంది ఉద్యమకారులు మంగళవారం జిల్లా కేంద్రం లోని కోర్టులో హాజరయ్యారు. ఉద్యమ కాలం లో నమోదైన కేసులను 2014నుంచి 2023వర కు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక జీవో ద్వారా అన్నింటిని మాపీ చేసింది. జిల్లా ఎస్పీ నుంచి వివరాలు అందజేయటంలో ఒక కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు విస్మరించారు. 2022లో చార్జి షీటు దాఖలు చేశారు. దానిని 2024లో ఆగస్టు 1న సమన్లు జారీ చేయటంతో మంగళవారం మొదటి సారి కోర్టులో హాజరయ్యారు. కోర్టుకు హాజరైన వా రిలో టీఎన్‌జీవోస్ ఆర్.చంద్రానాయక్, చంద్రక ళ, శివలీల, శివరత్నమ్మ, పుష్పవతి, చంద్రకాం త్‌రెడ్డి, రాములు, బాలరాజు, రియాజుద్దీన్, అజంఅలీ, లక్ష్మయ్య, డేవిడ్ ఉన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 11:26 PM